భద్రాద్రి లడ్డూ నెయ్యిపై వివాదం..ఆలయ ఈవోకు మంత్రి సురేఖ వార్నింగ్!

తెలుగు రాష్ట్రాలోని ఆలయాల్లో కల్తీ నెయ్యి వ్యవహారం దుమారమే రేపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆలయాలకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. దీంతో దేవాదాయశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

New Update
Konda Surekha,

TG News

TG News: విజయ డెయిరీ నెయ్యి కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చేలా వ్యవహరించకూడదని మంత్రి సూచించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి నెయ్యి సరఫరా టెండర్‌ను ఏపీకి చెందిన ప్రైవేట్ సంస్థ రైతు డెయిరీకి అప్పగించడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తారంటూ అధికారులను మంత్రి ప్రశ్నించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంతో  తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ--

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నుంచే నెయ్యి సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  తంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్య అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఏపీకి చెందిన రైతు డెయిరీ సంస్థకు నెయ్యి సరఫరా వర్క్ ఆర్డర్ భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి అప్పగించడంపై కొండాసురేఖ మండిపడ్డారు.

ఇది  కూడా చదవండి: జగిత్యాల గురుకులంలో కలకలం.. ఇద్దరు విద్యార్థులకు పాము కాటు!

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈవో రమాదేవికి ఛార్జ్‌మెమో జారీ చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు అప్పగించాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. భద్రాచలం రామాలయ ఈవో రమాదేవిని తిరిగి తన మాతృశాఖకు సరెండర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి 6 పైర్ ఇంజన్లు!

 

ఇది కూడా చదవండి: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించే అల్లం


ఇది కూడా చదవండి:
ఉదయాన్నే తుమ్ముల సమస్య నుంచి ఇలా బయటపడండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు