/rtv/media/media_files/2025/02/10/oSytdV5ZMKrAYC9SF6WB.jpg)
Minister Konda Surekha meet Rangarajan
Rangarajan: రంగరాజన్‌పై దాడిని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. సంఘ వ్యతిరేక శక్తులు రాముని పేరుతో రాజకీయాలు చేస్తూ, ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని అశాంతికి గురిచేస్తున్నాయన్నారు. అలాంటి వారి చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. సోమవారం రంగరాజన్‌తో పాటు అతని తండ్రి సౌందర రాజన్‌ను మంత్రి సురేఖ వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి అన్నివేళలా అండగా వుంటుందని భరోసానిచ్చారు.
చట్టబద్ధంగా శిక్షిస్తాం..
ఈ మేరకు ఎంతో ప్రాచీనమైన హిందూ ధర్మంలో ఎవరి నమ్మకాలు వారివని తెలిపారు. తమ నమ్మకాలను ఇతరులపై రుద్దడం వారి స్వేచ్ఛను హరించడమేనని మంత్రి మండిపడ్డారు. తన జీవిత పర్యంతం ధర్మానికే కట్టుబడి జీవించిన శ్రీరాముని పేరుతో హింసకు పాల్పడటం దారుణమన్నారు. ఈ దాడికి కారకులైన వారిని చట్టబద్ధంగా శిక్షిస్తామన్నారు. భవిష్యత్ లో ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. హిందూధర్మం ఎన్నో నదులను తనలో కలుపుకునే మహాసముద్రం వంటింది. అదే హిందూ ధర్మం గొప్పతనం. రామరాజ్యం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తూ రావణ రాజ్యం చేస్తామంటే చూస్తూ ఊరుకోమంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: MASTHAN SAI: మస్తాన్ సాయికి మరో షాక్.. కోర్టు కీలక ఆదేశాలు!
సీఎం రేవంత్ ఫోన్..
చిలుకూరు బాలాజీ టెంపుల్(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్(Rangarajan)కు సీఎం రేవంత్(CM Revanth Reddy) ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేశారు. దాడిపై విచారణ జరిపి రంగరాజన్ కు మరింత రక్షణ కల్పించనున్నట్లు తెలుస్తోంది.
Follow Us