హైదరాబాద్‌లో భారీ పేలుళ్లు.. భయంతో పరుగులు తీసిన జనం!

హైదరాబాద్ కోకాపేట్‌లో భారీ పేలుళ్లతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఓ నిర్మాణ సంస్థ డిటోనెటర్లు పెట్టి బ్లాస్టింగ్ చేయగా పెద్ద బండరాళ్లు గాల్లోకి లేచి ఎగిరిపడ్డాయి. పలువురికి గాయాలవగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

author-image
By srinivas
New Update

Hyderabad: హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. కోకాపేట్‌లో నియో పోలిస్ దగ్గర ఓ నిర్మాణ సంస్థ డిటోనెటర్లు పెట్టి బ్లాస్టింగ్ చేసింది. దీంతో ఒక్కసారిగా గాల్లోకి లేచిన బండరాళ్లు చెల్లా చెదురుగా ఎగిరిపడటంతో పలువురికి తీవ్రగాయాలవగా, వాహనాలు ధ్వంసమయ్యాయి.

తృటిలో తప్పిన భారీ నష్టం.. 

అయితే ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక స్థానికులు పరుగులు తీసినట్లు తెలిపారు. దాదాపు 10 బ్లాస్టింగ్స్‌ జరగడంతో భయాందోళనకు గురయ్యామని, సినిమా తరహాలో బండరాళ్లు గాల్లోకి లేచి ఎగిరిపడ్డాయని చెప్పారు. బ్లాస్టింగ్ చేసిన నిర్మాణ సంస్థపై నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. పేలుడు యాక్ట్‌తో పాటు BNS 125, 91B ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక అక్కడున్న పదిమంది కార్మికులు తృటిలో ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు