Raja Singh: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలన్నారు. నావాడు, నీవాడు అనుకుంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.