Raja Singh: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలన్నారు. నావాడు, నీవాడు అనుకుంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.

New Update

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌ రావు పేరు ఖరారైన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఒక్కరే నామినేషన్ వేయనున్నారు. దీంతో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. అయితే బీజేపీ అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. '' రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకరిని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలి. 

Also Read: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!

నావాడు, నీవాడు అనుకుంటూ నియమించుకుంటూ పోతే బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలిని'' రాజాసింగ్ అన్నారు. ఇదిలాఉండగా రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఎవరికి అప్పగించాలనే దానిపై బీజేపీ అగ్రనేతలు గత కొంతకాలంగా తీవ్ర కసరత్తులు చేశారు.

Also Read: నా భర్త అమాయకుడు, స్వేచ్ఛ బ్లాక్ మెయిల్ చేసింది: పూర్ణచందర్‌ భార్య సంచలన కామెంట్స్!

ముందుగా ఈ పదవి కోసం ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కె.లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావు పేర్లు బలంగా వినిపించాయి. వీళ్లల్లో ధర్మపురి అరివింద్ లేదా ఈటల రాజేందర్‌కు ఇచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం నడిచింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులతో పాటు పలువురు సీనియర్ నేతలు రామచందర్‌ రావు పేరును ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే హైకమాండ్‌ రామచందర్‌ రావుకు అధ్యక్ష పగ్గాలు అప్పగించనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు