Rajasingh: రాజాసింగ్ రాజీనామా ఆమోదం!

రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించింది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన రాజీనామాను ఆమోదించారు. రాంచందర్‌ రావుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల రాజాసింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

New Update
Raja Singh

Raja Singh

బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను పార్టీ అధిష్టానం ఆమోదించింది. రామచందర్ రావుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నేషనల్ సెక్రటరీ అరుణ్ సింగ్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. రాజీనామా సందర్భంగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రకటనలో తప్పుపట్టారు. అవి పూర్తిగా అసంబద్ధమైనవని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి:MLA Raja Singh: బండి సంజయ్‌కి రాజాసింగ్ సంచలన ట్వీట్.. అన్నా అంటూ..

రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. 'నేను రిజైన్ లెటర్ కిషన్ రెడ్డికి ఇచ్చాను. ఈ లెటర్ స్పీకర్ కు పంపించమని చెప్పాను. నాకు మద్దతుకు వచ్చిన వారిని బెదిరించారు. నాకు ముగ్గురు కౌన్సిల్ మెంబెర్స్ మద్దతుగా సంతకం పెట్టారు. ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేసి పైన కూర్చున్నారు. తెలంగాణలో బీజేపీ రావొద్దని అనుకునే వారి సంఖ్య పెరిగింది' అన్నారు. 
ఇది కూడా చదవండి:MLA Raja Singh: బండి సంజయ్‌కి రాజాసింగ్ సంచలన ట్వీట్.. అన్నా అంటూ..

అనంతరం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌ రావు నియామకంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకరిని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలి. నావాడు, నీవాడు అనుకుంటూ నియమించుకుంటూ పోతే బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలని'' రాజాసింగ్ అన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు