TG Crime : నువ్వు చామనచాయ రంగులో ఉన్నావ్.. కొడుకు తెల్లగా ఎలా పుట్టాడని భర్త వేధింపులు.. చివరికి
ఏడాది బాబు ఉన్న తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిచివేస్తోంది. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రసన్నలక్ష్మి(28), తిరుపతికి 2023లో వివాహమైంది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారు.
TG Free Cancer Test : ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నమోదవుతున్నకేసుల్లో 41 శాతం ఓరల్, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లున్నాయి. ముందస్తు గుర్తింపుతో ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సర్కారు భావిస్తోంది.
కరీంనగర్లో కనువిందు చేసిన అరుదైన నారాయణ పక్షి
కరీంనగర్లో ఎల్ఎండీ డ్యామ్ సమీపంలో అరుదైన నారాయణ పక్షి కనువిందు చేసింది. ఈ పక్షి రెక్కలు చూడటానికి నలుపు, బూడిద రంగుల్లో ఉంటుంది. అయితే తెలుగులో నారాయణ పక్షిగా పిలిచే దీని శాస్త్రీయ నామం ఆర్డీయా సినిరియా.
ఎంత పని చేశావమ్మా.. కన్న కూతురిని గొంతు నలిపి చంపిన కసాయి తల్లి
పెద్దపల్లి జిల్లా టీచర్స్ కాలనీలో విషాద ఘటన జరిగింది. మూడేళ్ల పాపను కన్న తల్లి సాహితీ గొంతు నలిపి చంపి ఆ తర్వాత సాహితీ ఫ్యానుకు ఊరి వేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో సాహితీ ఈ దారుణానికి ఒడిగట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎంతకు తెగించావ్ రా.. ప్రేమ పెళ్లి.. ఆరు నెలలకే..!
జగిత్యాల కోరుట్లలో రజిత అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయ్యప్ప గుట్టపై మహిళ మృతదేహం కనిపించింది. పవన్ అనే వ్యక్తిని 6 నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనే రజితను చంపినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విషాదం.. సరదాగా పొలానికి వెళ్లిన చిన్నారి.. ఆ తర్వాత ఏమైందంటే?
కరీంనగర్లో సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అత్తమ్మ వాళ్లు పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లి ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. ట్రాక్టర్‌తో పాటు చిన్నారి బావిలోకి దూసుకెళ్లడంతో మృతి చెందింది.
శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!
కరీంనగర్లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Telangana : సిగరెట్ పొగ వచ్చిందని ఒకరు.. గ్రూప్స్‌కు సెలక్ట్ కాలేదని మరోకరు! .
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు వదిలిన సిగరెట్ పొగ మరో యువకుడి పైకి వెళ్లడంతో తీవ్ర గొడవ జరిగింది. దీంతో సిగరెట్ తాగిన యువకుడిని తొమ్మిది మంది కలిసి కొట్టి చంపేశారు. మరో ఘటనలో గ్రూప్స్ కు సెలెక్ట్ కాలేదని యువతి ఆత్మహత్యకు పాల్పడింది.