ACB Raids Karimnagar: ఎంత మంది గోసనో.. ఏసీబీకి దొరికిన పంచాయతీ కార్యదర్శి.. ఊర్లో సంబరాలు!

కొద్దిరోజులుగా అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగలు ఏ మాత్రం మారడం లేదు. వారిలో ఏ మాత్రం కూడా భయం కూడా పుట్టడం లేదు.

New Update
acb nagaraju

ACB Raids Karimnagar: కొద్దిరోజులుగా అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగలు ఏ మాత్రం మారడం లేదు. వారిలో ఏ మాత్రం కూడా భయం కూడా పుట్టడం లేదు. తాజాగా ఓ పంచాయ‌తీ అధికారి కూడా ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అతని వలన చాలా ఇబ్బందులు పడ్డ గ్రామస్థులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Also Read: Karimnagar : ఎంత మంది గోసనో.. ఏసీబీకి దొరికిన పంచాయతీ కార్యదర్శి.. ఊర్లో సంబరాలు!

వివారల్లోకి వెళ్తే..  కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి  ఏకంగా రూ.  20 వేల  లంచం డిమాండ్ చేశారు. లంచం ఇస్తేనే ఇంటి నంబ‌ర్ ఇస్తాన‌ని తెగేసి చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారుల‌ను ఆశ్రయించాడు.  అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం పంచాయతీ కార్యదర్శి నాగరాజు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Also Read: అమ్మో.. నేను పోను అమెరికాకు.. వీసా రూల్స్ తో వణుకుతున్న స్టూడెంట్స్!

పటాకులు కాల్చి మరి  సంబరాలు

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పటాకులు కాల్చి మరి  సంబరాలు జరుపుకున్నారు. నాగరాజు  నిత్యం లంచాలతో తమను పీడించాడని గ్రామ‌స్తులు అంటున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వ అధికారి అయిన లంచం డిమాండ్ చేస్తే 1064 నెంబర్ కి సమాచారం అందించాలని కోరారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

వరంగల్‌ తహసీల్దార్‌ ఇంట్లో సోదాలు 

మరోవైపు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై వరంగల్‌ తహసీల్దార్‌ బండి నాగేశ్వరరావు నివాసంలో ఏసీబీ అధికారులు శుక్రవారం విస్తృతంగా సోదాలు చేపట్టారు.  హనుమకొండ చైతన్యపురిలోని ఆయన నివాసంతో పాటుగా బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు ప్రత్యేక బందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించాయి. సోదాల్లో అధికారలు దాదాపు రూ.5కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. రూ.1.15 కోట్ల విలువైన ఇంటి పత్రాలు, రూ.1.42 కోట్ల విలువైన 17.10 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ , రూ.23.84లక్షల విలువైన 70 తులాల బంగారం, రూ.92వేల విలువైన 1,791 గ్రాముల వెండి వస్తువులు, రూ.34.78 లక్షల విలువైన 6 వాహనాలు, రూ.3.28 లక్షల విలువైన చేతి  గడియారాలను గుర్తించారు. హనుమకొండ జిల్లాలోని హసన్‌పర్తి, ధర్మసాగర్‌, కాజీపేట మండలాల్లో కూడా నాగేశ్వరరావు గతంలో తహసీల్దార్‌గా పనిచేశారు.

Also Read:  Trump Tariffs Effect: ట్రంప్‌కు మరో బిగ్ షాక్.. ఆ క్యాంపస్‌లో యూఎస్ బ్రాండ్స్ కోకా కోలా, పెప్సీకో డ్రింక్స్ నిషేధం!

Advertisment
తాజా కథనాలు