Red Alert : తస్మాత్‌ జాగ్రత్త...రేపు తెలంగాణకు IMD రెడ్ అలెర్ట్ జారీ..

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రేపు తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు తెలంగాణ 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

New Update
rains

Red Alert in telangana

Red Alert : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. ఎవరూ కూడా అవసరం లేకుండా బయటకు రావద్దని అధికారులు సూచించారు. అత్యవసర పనులు ఉన్న వారు తప్ప మిగిలిన వారు తమ పనులను వాయిదా వేసుకోవాలని సూచించారు.ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో భీకర వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో భారీ వరదలు మొదలయ్యాయి. మెట్‌పల్లిలోని కాకతీయ కెనాల్‌లో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

ఇది కూడా చదవండి:AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీలో ఘరానా మోసం .. ఫేక్ సర్టిఫికెట్లతో దొరికిపోయారు!


యువకుడి గల్లంతు..

కోరుట్ల మండలం పెద్దాపూర్‌ నుంచి రామారావు పల్లె వెళ్లే కెనాల్‌ వద్ద యువకుడు గల్లంతయ్యాడు. ట్రాక్టర్‌పై వినాయకుడి విగ్రహం తీసుకెళ్తుండగా కెనాల్‌ వద్ద బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌కెనాల్‌లో పడిపోయింది. ఈ ఘటనలో  నలుగురు యువకులు కెనాల్‌ లో పడిపోయారు. కాగా నలుగురిలో ఒకరు గల్లంతు కాగా ముగ్గురు క్షేమంగా ఉన్నారు. గల్లంతైన వ్యక్తి మెట్‌పల్లి మాజీ జెడ్పీటీసీ కొడుకు శ్రీకర్‌గా గుర్తించారు. శ్రీకర్‌ ఆచూకీ కోసం స్థానికులతో పాటు ప్రభుత్వ అధికారులు గాలిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్..  మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు

ఐదుగురు గల్లంతు

అలాగే  రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఐదుగురు గల్లంతయ్యారు. గేదెలను మేపడానికి వెళ్లిన ఐదుగురు ఒక్కసారిగా కురిసిన వర్షాలతో వరదలు వచ్చి గల్లంతయ్యారు. గల్లంతైన వారిని రక్షించాలంటూ  కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా  పలు ప్రాంతాల్లో కాలనీలు, ఇళ్లు నీట మునిగాయి. కార్లు, ఆటోలు వరదలో కొట్టుకుపోయాయి.భారీ వరదల్లో ఇప్పటి వరకు ఐదుగురు గల్లంతు కాగా, కోరుట్లలోనూ శ్రీకర్ అనే యువకుడు గల్లంతయ్యాడు.

Also Read: పైసలకు కక్కుర్తి పడి కత్తులకు పని.. సిజేరియన్‌లో పుట్టిన పిల్లలకు భయంకరమైన వ్యాధులు!

Advertisment
తాజా కథనాలు