Karimnagar : తేజ్.. నన్ను నమ్మురా.. నేను అలాంటిదాన్ని కాదంటూ వివాహిత సూసైడ్!

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండంలోని శంకరపట్నంలో దారుణం జరిగింది. భర్త వేధింపులు భరించలేక శ్రావ్య బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు భర్త వేధింపులపై చివరి వీడియో రికార్డు చేసింది.

New Update
sravya

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండంలోని శంకరపట్నంలో దారుణం జరిగింది. భర్త వేధింపులు భరించలేక శ్రావ్య బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు భర్త వేధింపులపై చివరి వీడియో రికార్డు చేసింది. తేజ్‌ నేనెవరితో మాట్లాడలేదు.. ఆ దేవుడు, నా కొడుకు,..మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా.. నా కొడుకును బాగా చూసుకో అంటూ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఎవరితో సంబంధం లేదని నీ వేధింపులతో నాకు పిచ్చెక్కుదంటంటూ వీడియోలో ఏడ్చేసింది.  ఆమె సెల్ఫీ వీడియో చూసిన బంధువులందరూ కన్నీరుమున్నీరయ్యారు.

భర్త దుబాయ్‌ వెళ్లడంతో

రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్‌ను 2020లో ప్రేమించి పెళ్లి చేసుకుంది గొట్టె శ్రావ్య.  పెళ్లి తర్వాత ఉపాధికోసం రెండున్నర సంవత్సరాల క్రితం దుబాయ్‌ వెళ్లాడు ధర్మతేజ్‌.. భర్త దుబాయ్‌ వెళ్లడంతో పుట్టింట్లోనే ఉంటుంది శ్రావ్య.  కొంతకాలంగా ధర్మతేజ్‌, శ్రావ్య మధ్య మనస్పర్థలు రావడంతో శ్రావ్య మరొకరితో మాట్లాడుతుందంటూ ఆమెను మానసికంగా హింసించాడు ధర్మతేజ్‌.   . ఆ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన శ్రావ్య మంగళవారం ఇంట్లో ఉరేసుకొని మృతి చెందింది.  శ్రావ్య సోదరుడు గొట్టె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రియుడితో సుఖం కోసం

కరీంనగర్ లో ప్రియుడితో సుఖం కోసం కట్టుకుని భర్తను ప్లాన్ చేసి మరీ కడతేర్చింది ఓ ఇల్లాలు. కరీంనగర్‌కు చెందిన ఐలవేని సంపత్‌ (45), రమాదేవి దంపతలకు ఇరవై ఏళ్లు నిండిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంపత్‌ కరీంనగర్‌లోని ఓ లైబ్రేరీలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. రమాదేవి సర్వపిండి అమ్ముతుంది. ఆమె వద్దకు కరీంనగర్‌కే చెందిన కర్రె రాజయ్య (50) తరచూ సర్వపిండి తినడానికి వచ్చేవాడు, అక్కడ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అప్పటికే భర్త మద్యానికి పూర్తిగా బానిసై తనను వేధిస్తుండటం.. రాజయ్య ఏర్పడిన అనుబంధంతో సంపత్‌ను అడ్డు తొలగించుకోవాలని రమాదేవి పెద్ద స్కెచ్ వేసింది. ప్రియుడు రాజయ్య, తన దూరపు బంధువు కీసరి శ్రీనివాస్‌ (35)తో కలిసి భర్తను చంపేసింది.  

ఎవరి చెవుల్లోనైనా పురుగుల మందు పోస్తే ఆ వ్యక్తి  వెంటనే చనిపోతాడనే  ఓ యూట్యూబ్‌ వీడియో ద్వారా తెలుసుకున్న రమాదేవి అదే పద్ధతిలో భర్తను చంపాలని ప్లాన్ వేసింది.  ప్రియుడు రాజయ్య, శ్రీనివాస్ లకు ఇదే విషయాన్ని  చెప్పింది. పార్టీ చేసుకుందాం అంటూ జూలై 29న సంపత్‌కు వారిద్దరూ ఆఫర్‌ చేశారు. దీంతో వారిద్దరూ అదేరోజు బొమ్మకల్‌ ఫ్లైఓవర్‌ వద్దకు రావాలని చెప్పడంతో సంపత్‌ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ముగ్గురు కలిసి ఫుల్ గా తాగారు. అయితే  మత్తు ఎక్కువై సంపత్‌ తూలుతూ కింద పడిపోగానే రాజయ్య, శ్రీనివాస్‌ వెంటనే అతడి చెవుల్లో వెంటతెచ్చుకున్న గడ్డిమందును పోశారు. దీంతో  కొద్దిసేపటికి సంపత్‌ అక్కడిక్కడే చనిపోయాడు. అనంతరం వారిద్దరూ ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.  

Also read :  Srushti Fertility Centre : సృష్టి కేసులో సంచలన విషయాలు.. ఆ గ్యాంగులతో నమ్రతకు లింకు

Advertisment
తాజా కథనాలు