హైదరాబాద్‌లో త్వరలో ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం.. ప్లానింగ్ ఇదే
హైదరాబాద్‌లో మూసీ తీరంలోని ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుల గణన సర్వే బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొంది .రెండు వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
TG Caste Census: ఈ వారంలోనే కులగణన.. అడిగే 54 ప్రశ్నలివే!
తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే కులగణన కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 54 ప్రశ్నలతో 7 పేజీలను రూపొందించిన ప్రణాళిక శాఖ.. తాజాగా ఆస్తులు, రిజర్వేషన్ల ద్వారా లబ్దిపొందిన వివరాలను సేకరించేలా కొత్త ఫార్మాట్ తయారు చేసినట్లు తెలుస్తోంది.
Revanth: మూసీ ఎలా మారనుందంటే.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!
మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని సీఎం రేవంత్ అన్నారు. ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడాలని సదర్ సమ్మేళనంలో కోరారు. సదర్ సమ్మేళనం ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టు చేపడుతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్లాన్‌ను పక్కకు పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కమీషన్ల కోసమే రేవంత్ సర్కార్ కొండగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు.
వాళ్లకి గుడ్‌న్యూస్.. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు..
కేబినెట్ సమావేశంలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి, గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
స్పోర్ట్ వర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబరు నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును త్వరగా రూపొందించాలని ఆదేశించారు.