హైదరాబాద్‌ వస్తున్నా.. దమ్ముంటే ఆపండి: అఘోరీ సవాల్!

హైదరాబాద్‌ వస్తున్నా.. దమ్ముంటే ఆపండి అంటూ సీఎం రేవంత్ కు అఘోరీ సవాల్ విసిరింది. ఆరు గుళ్లపై దాడులు జరిగితే రేవంత్ నువ్వేం చేస్తున్నావ్. ఒక్కడిపైనా చర్యలు తీసుకోలేదు. మీకు శివతాండవం చూపిస్తా అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది. 

New Update

Lady Aghori: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అఘోరీ సంచలన వీడియో విడుదల చేసింది. విజయవాడ దుర్గమ్మ దర్శనం తర్వాత హైదరాబాద్‌ వస్తానని తెలిపింది. హైదరాబాద్‌ వస్తున్నా.. ఎలా ఆపుతారో చూస్తానని ప్రభుత్వానికి సవాల్ విసిరింది. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో ఆరు గుళ్లపై దాడులు జరిగాయని తెలిపింది. అయినప్పటికీ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను హైదరాబాద్‌ వచ్చాక శివతాండవం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే అఘోరీ హైదరాబాద్‌కు వచ్చి ఎలాంటి ఆందోళన చేస్తుందోనన్న చర్చ మొదలైంది.

లోక కల్యాణం కోసమే ఈ పూజలు..

ఈ మేరకు అఘోరీ మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణకు గురువుల ఆదేశానుసారం దేశంలో పర్యటిస్తున్నానని చెప్పారు. మహిళలపైన, చిన్నారులపైన, హిందూ దేవాలయాలపైన దాడులు నివారించబడేందుకు, లోక కల్యాణం కోసం తాను కృషి చేస్తున్నానని అన్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలను సందర్శిస్తున్నానని తెలిపారు.

దర్శనానికి అనుమతించేది లేదు..

ఆదివారం శ్రీశైలంలో ప్రత్యక్షమైంది. కార్తీక మాసంలో ప్రముఖ శైవ క్షేత్రాలను వరుసగా సందర్శిస్తున్న అఘోరీ శ్రీశైలం శ్రీ మల్లిఖార్జున స్వామిని దర్శించుకుంది. అఘోరీ దిగంబరంగా స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేయగా ఆలయ అధికారులు అడ్డుకున్నారు. వస్త్ర ధారణ లేకుండా దర్శనానికి అనుమతించేది లేదని ముఖద్వారం వద్ద అఘోరిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు నిలిపేశారు. దాంతో ఆమె వస్త్రధారణ చేసుకుని స్వామి వారిని, అమ్మవార్లను దర్శించుకుంది. ఆలయంలోకి ప్రవేశించిన అఘోరీని భక్తులు ఆసక్తిగా తిలకించారు. చాలా మంది ఆమె ఆశీర్వాదం కోసం ప్రయత్నించారు. మహిళా పోలీసులు, ఆలయ సిబ్బంది ఆమెకు దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు