Lagacharla: లగచర్లలో మళ్లీ హై టెన్షన్..!

లగచర్ల గ్రామంలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ డీకే అరుణ లగచర్ల పర్యటనలో తీవ్ర ఉద్రిక్రత చోటుచేసుకుంది. ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఎంపీనే అడ్డుకుంటారా? అంటూ పోలీసులపై అరుణ ఫైర్ అయ్యారు.

author-image
By srinivas
New Update
ere

DK Aruna : లగచర్ల గ్రామంలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కొడంగల్, లగచర్ల పర్యటనలో తీవ్ర ఉద్రిక్రత చోటుచేసుకుంది. మన్నెగూడ వద్దకు చేరుకోగానే డీకే అరుణ వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఎంపీగా తన నియోజకవర్గంలో పరామర్శించొద్దా? అంటూ అరుణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read :  హైడ్రాకు షాక్.. కూల్చివేతలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!

సీఎం వల్లే లా & ఆర్డర్ సమస్య..

ఈ మేరకు 'నేను ఎంపీని. ఏ తప్పు చేశానని అడ్డుకుంటున్నారో చెప్పండి?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే జిల్లాలో లా & ఆర్డర్ సమస్య వచ్చింది. నేను జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు వెళ్తున్నా. నా నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది. సొంత నియోజకవర్గంలో లా & ఆర్డర్ కంట్రోల్ చేసుకోలేక పోయారు. మేము లా & ఆర్డర్ బ్రేక్ చేసే పని ఏమీ చేయడం లేదు కదా? కలెక్టర్ ను కలుస్తా. నాకు అపాయింట్మెంట్ ఉంది' అంటూ ఫైర్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: కలెక్టర్ పై దాడి ఎలా చేశారంటే.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు!

రేవంత్ రెఢ్డిని అరెస్ట్ చేయండి..


అయినా పోలీసులు వినకపోవడంతో మరోసారి రెచ్చిపోయిన అరుణ.. సీఎం రెవంత్ రెడ్డి వల్లే లా & ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. రేవంత్ రెఢ్డిని అరెస్ట్ చేయండి. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వెళ్తే లా & ఆర్డర్ ప్రాబ్లమ్ రాదా?  ముఖ్యమంత్రి అన్నను పంపిస్తారు? ఎంపీగా నేను వెళ్లకూడదా? ఇదేక్కడి దౌర్జన్యం? రాష్ట్రంలో ఎంపీగా నా నియోజకవర్గంలో నేను పర్యటించొద్దా? అని ప్రశ్నించారు. అలాగే తనను స్టేషన్ కు రమ్మని పోలీసులు చెప్పగా.. ఎందుకు వస్తాను? నేనేం తప్పు చేశానంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  ‎వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం?

Also Read : మీకు క్యాన్సర్‌ వస్తుందో రాదో AI చెప్పేస్తుంది..ఎలాగంటే?


Advertisment
తాజా కథనాలు