నీవు ఒక దొంగ.. తెలంగాణ నిన్ను మరిచిపోయింది: కేసీఆర్ కు రేవంత్ కౌంటర్

ఈ పది నెలల్లో ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు అర్ధమైందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు.. తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేమీ లేదన్నారు. కేసీఆర్ ను బడిదొంగతో పోల్చారు.

author-image
By srinivas
New Update
Revanth Reddy KCR Komati reddy venkat reddy

Telangana: ఈ పది నెలల్లో ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు అర్ధమైందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు.. తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేమీ లేదన్నారు. ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారని, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారని చెప్పారు. అలాగే 1కోటి 5లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఆ ఘనత ప్రజా ప్రభుత్వానిది..

ఈ మేరకు రేవంత్ మాట్లాడుతూ.. నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. 49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు. రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. 21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు. 35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకుండు కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు. మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి: ఏపీ బడ్జెట్.. మెగా డీఎస్సీ, తల్లికి వందనంపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన!

తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది..

ఇక ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం. త్వరలో వారికి నియామకపత్రాలు అందించి.. వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని చెప్పారు రేవంత్. పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ చేసాం. మీరు లేకపోయినా ఏం బాధలేదు. మీతో ప్రజలకేం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి. బడి దొంగలను చూసాం కానీ.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: సీఎం ఇలాఖాలో ఉద్రిక్తత.. తిరగబడ్డ జనం.. ఏకంగా కలెక్టర్ నే పరిగెత్తించి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు