Kodangal: కలెక్టర్ పై దాడి చేసిన వారికి బిగ్ షాక్.. రంగంలోకి డీజీపీ! వికారాబాద్ జిల్లా లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. By srinivas 11 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Kodangal: వికారాబాద్ జిల్లాతో ప్రభుత్వ అధికారులపై రాళ్లు రువ్విన వారిపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది. సోమవారం దూద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ ప్రతిక్ జైన్, ఇతర అధికారులు వెళ్లగా వారిపై జగం తిరగబడ్డారు. పిడిగుద్దులు, కర్రలతో చితకబాదారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడి చేశారు. కలెక్టర్ సహా ఇతర అధికారులకు చెందిన మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కలెక్టర్, MROలను ప్రజలు పరుగెత్తించి, పరుగెత్తించి కొట్టారు. ఇది కూడా చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు! భవిష్యత్తులో ఇలా జరుగకుండా చర్యలు.. అయితే ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ప్రభుత్వ అధికారులు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అధికారులపై దాడికి ఉసిగొల్పిన, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరనున్నట్లుగా తెలిపారు. ఇది కూడా చదవండి: కవితకు బెయిల్ ఎలా వచ్చిందో మాదగ్గర ఆధారాలున్నాయి.. పొంగులేటి ! ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళన.. వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామసభలో ప్రజాభిప్రాయానికి సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలక్టర్, కడా ప్రత్యేక అధికారి, కొండగల్ తహశీల్దార్, ఇతర రెవిన్యూ అధికారులు, సిబ్బంది వచ్చారన్నారు. ఈ సమయంలోనే కొందరు అధికారులపై దాడులు చేశారని చెప్పారు. వాహనాలను సైతం ధ్వంసం చేశారని, ఇది హేయమైన చర్యగా పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇలాంటి దాడూలతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇది కూడా చదవండి: బ్లూ డ్రెస్‌లో ఈ ప్రపంచ సుందరిని చూస్తే చెమటలు పట్టాల్సిందే! ఇది కూడా చదవండి: బ్లూ డ్రెస్‌లో ఈ ప్రపంచ సుందరిని చూస్తే చెమటలు పట్టాల్సిందే! #telangana #kodangal #CM Revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి