CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్! TG: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడ్డవాళ్లను, అందుకు ప్రోత్సహించిన వాళ్లను ఎట్టపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. లగచర్ల ఘటన వెనుక ఎంతటి వారున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని ఆయన అన్నారు. By V.J Reddy 13 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి CM Revanth Reddy: వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ దాడికి ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వారిని పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని అన్నారు. లగచర్ల గ్రామంలో జరిగిన దాడి వెనుక ఎంతటి పెద్ద వారు ఉన్న జైలులో ఊచలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పారు. జరిగిన దాడులను ఖండించాల్సిన బీఆర్ఎస్ నేతలు.. దాడి చేసినవాళ్లను పరామర్శించడం ఏంటని ఫైర్ అయ్యారు. ఇలాంటి దాడులు బీఆర్ఎస్ నేతలపై జరిగితే కేటీఆర్ సమర్థిస్తరా?అని నిలదీశారు. ఇది కూడా చూడండి: పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే! మూడోసారి మెదడు పోయింది... ఢిల్లీ పర్యటనలో సీఎం సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మొదటి సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయారని.. రెండోసారి డిపాజిట్లు కోల్పోయారని.. మూడోసారి ఏకంగా మెదళ్లు కూడా కోల్పోయారని చురకలు అంటించారు. పాపం బీఆర్ఎస్ నేతలను చూస్తే తనకు జాలి వేస్తోందని.. వారు ఈ సమస్య నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు! ఢిల్లీలో బీజేపీకి జపం... మాజీ మంత్రి కేటీఆర్.. తాను చేసిన అవినీతిలో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఢిల్లీలోని బీజేపీ పెద్దల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నితీష్ కుమార్, చంద్రబాబునాయుడు దయతో మోదీ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. వాళ్ళిద్దరూ అనుకుంటే ఒక సంవత్సరంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ లు అయితే కవల పిల్లలు అంటూ రేవంత్ విమర్శించారు. ఏసీబీ గవర్నర్ కు లేఖ రాసి 15 రోజులైందని... ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా రాలేదని ప్రశ్నించారు. మరోవైపు కేటీఆర్ రెండు రోజులు ఢిల్లీలో చక్కర్లు కొట్టారని.. ఆయన వచ్చి వెళ్లిన వెంటనే గవర్నర్ ను ఢిల్లీని ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ Also Read: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం #CM Revanth #pharma project #farmers attack officials #vikarabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి