/rtv/media/media_files/2024/12/22/kBREyvmrqxXSQRLpDFRz.jpg)
kachiguda-chennai Egmore Train
కాచిగూడ నుంచి చెన్నై వెళ్తున్న ఎగ్మోర్ రైలులో అకస్మాతుగా మంటు అంటుకున్నాయి. బీ4 బోగీలో మంటలు చెలరేగాయి. గద్వాల రైల్వే స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అధికారులు అప్రమత్తమవడంతో పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. మంటల గురించి తెలుసుకున్న అధికారులు ప్రయాణికులను వెంటనే రైలు దింపేశారు. మంటలను అదుపులోకి ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఫైర్ ఎలా అంటుకున్నాది అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ట్రైన్ ఇంకా గద్వాల్ స్టేషన్‌లోనే ఉంది. పూర్తిగా రైలును చెక్ చేసి ఇంకేం ప్రమాదం లేదని తెలిసాకనే ప్రయాణించడానికి సిగ్నల్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దీనికి కొంత సమయం పడుతుందని..దీని కారణంగా కాచిగూడ–చెన్నై ఎగ్మోర్ ట్రైన్ ఆలస్యంగా నడుస్తుందని చెప్పారు.
Also Read: Allu Arjun: ఇంటిపై దాడి...స్పందించిన అల్లు అరవింద్
Follow Us