/rtv/media/media_files/2025/11/13/fotojet-92-2025-11-13-21-04-38.jpg)
Leaving the car on the railway track..
Hyderabad : హైదరాబాద్ కాచిగూడలో కారు కలకలం రేపింది.కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి కారు వదిలేసి వెళ్లిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని అగంతకుడు రైల్వే ట్రాక్ పైనే కారు వదిలి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకొని తనిఖీలు చేస్తున్నాయి. కారులో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు పోలీసుల గుర్తించారు. దీంతో కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో ఆంక్షలు విధించారు. బాలాజీ అనే వ్యక్తి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్టు పోలీసుల గుర్తించారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2025
కాచిగూడ రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని కారు కలకలం
రైల్వే ట్రాక్‌పై కారును వదిలి వెళ్లిన దుండగులు
ఢిల్లీ ఘటన నేపధ్యంలో పోలీసులు హై అలెర్ట్
బాలాజీ అనే పేరుతో రిజిస్టర్ అయ్యి ఉన్నట్లు గుర్తించి పోలీసులు విచారించగా, కారు రెంట్‌కి ఇచ్చినట్టు తెలిపిన యజమాని… pic.twitter.com/tImJAVEpKJ
కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా బాలాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కారు పేలుడు ఘటనతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రముప్పు నేపథ్యంలో నిత్యం అలర్ట్‌గా ఉంటున్నారు.దేశ వ్యాప్తంగా కార్లతోనే దాడులకు ప్లాన్ చేశారని అనుమానాలు బలపడతున్న సమయంలో ఇలా కారు వదలివెళ్లడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది.అయితే కారు రైల్వే ట్రాక్ కింద పార్క్ చేసి ఉండటంతో కొంత హడావుడి నెలకొంది. అయితే.. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సమస్య లేదని పోలీసులు నిర్ధారించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో హైఅలర్ట్​ కొనసాగుతోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ పోలీసులు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ తదితర స్టేషన్లలో హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి ప్రయాణికుల సామగ్రిని స్క్రీనింగ్ చేశారు. అనుమానాస్పద లగేజీ, వ్యక్తులు కనిపిస్తే ఆర్పీఎఫ్ లేదా రైల్వే సిబ్బందికి తెలియజేయాలని కోరారు. మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్​సిటీ, రాయదుర్గం మెట్రోస్టేషన్లలో పోలీసులు ఇప్పటికే తనిఖీలు చేశారు.
Follow Us