WAR: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బలైన భారత యువత!
ఉద్యోగవకాశల కోసం రష్యా వెళ్లిన కొందరు భారతీయ యువకులు ఉక్రెయిన్ తో జరిగిన యుద్ధంలో మరణించారు. దీంతో విచారణ చేపట్టిన భారత దర్యాప్తు సంస్థ విస్తుపోయే నిజాలను బయటకు తీసింది.
ఉద్యోగవకాశల కోసం రష్యా వెళ్లిన కొందరు భారతీయ యువకులు ఉక్రెయిన్ తో జరిగిన యుద్ధంలో మరణించారు. దీంతో విచారణ చేపట్టిన భారత దర్యాప్తు సంస్థ విస్తుపోయే నిజాలను బయటకు తీసింది.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏకంగా తండ్రినే చంపేందుకు ప్లాన్ వేశాడు ఓ యువకుడు. కొంతకాలంగా ఖాళీగా ఉంటున్న 25 ఏళ్ల అమిత్.. నాన్న మరణిస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుందని ఆశపడ్డాడు. కిరాయి హంతకులతో రామ్‌జీపై కాల్పులు జరిపించిన ఈ భయంకరమైన ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేక పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలోని 84 పోస్టులను భర్తీ చేస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి 30 నవంబర్ 2023 వరకు చివరి తేదీ.
ఉత్తరప్రదేశ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తికి 28 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగం వచ్చింది. అంకుర్ గుప్తా అనే వ్యక్తి 1995లో తపాలాశాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. అతను మెరిట్ జాబితాలో చోటు సంపాదించుకుని ముందస్తు శిక్షణకు కూడా ఎంపికయ్యాడు. కానీ అతని విద్యార్హతల కారణంగా ఉద్యోగానికి అనర్హుడంటూ తపాలాశాఖ అంకుర్‌ను ఎంపికైన అభ్యర్థుల జాబితా నుంచి తొలగించింది. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు రావడంతో దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం అతనికి నెలరోజుల్లో ఉద్యోగాన్ని ఇవ్వాలని తపాలాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థ NTPC ఇంజనీర్ల కోసం అనేక పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఇతర సమాచారం కోసం ఇక్కడ చదవండి.
నిరుద్యోగులకు శుభవార్త. అక్టోబర్ 9న మహబూబాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. సూర్య చంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ ఉదయం 9గంటల మహబూబాబాద్ న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు.
నేషనల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం వెయ్యికిపైగా పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రకటించింది. పదో తరగతి అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 15 చివరి తేదీగా ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.