జాబ్ రిజైన్ చేసే ప్లాన్‌లో ఉన్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

జాబ్ రిజైన్ చేసే ముందు ప్రతీ ఒక్కరూ తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కంపెనీ బాండ్ రూల్స్ బట్టి రిజైన్ చేయాలి. అలాగే చేతిలో వేరొక ఆఫర్ ఉంటేనే రిజైన్ చేయాలి. లేకపోతే చేయకూడదు. ముఖ్యంగా మీకు ఉన్న సెలవులు అన్ని వినియోగించుకున్న తర్వాత రిజైన్ చేయాలి.

New Update
Job Resign

Job Resign

మంచి ఉద్యోగం వచ్చిందనో లేకపోతే శాలరీ కోసమే కొందరు జాబ్‌కి రిజైన్ చేయాలని అనుకుంటారు. వీరంతా ఒక ప్లాన్ ప్రకారం రిజైన్ చేస్తారు. మరికొందరు ఆఫీసులో ఏదైనా గొడవ జరిగితే కోపంలో వెంటనే ఉద్యోగం రిజైన్ చేస్తారు. కనీసం ఒక్క సెకను కూడా ఆలోచించకుండా జాబ్‌ మానేస్తారు. ఇలా మీరు కూడా చేయాలనుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

బాండ్ ఉందో లేదో?

కొన్ని కంపెనీలకు బాండ్ ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడు కంపెనీ ఒక ఫామ్ ఇచ్చి ఉంటుంది. దాన్ని చదివిన తర్వాతే రిజైన్ చేయండి. అందులో రూల్స్ ప్రకారం ఫాలో అవ్వండి. లేకపోతే మాత్రం మీరు సమస్యలో పడతారు.  

ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

ఆఫర్ బట్టి
వేరే దగ్గర ఉద్యోగానికి జాయినింగ్ డేట్ బట్టి కంపెనీలో రిజైన్ చేయండి. జాయినింగ్ లెటర్ లేకుండా ముందుగానే రిజైన్ చేస్తే మీరు ఖాళీగా కొన్ని రోజుల ఉండాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఫైనన్షియల్‌గా అంతా ఒకే అనుకుంటేనే రిజైన్ చేయండి. లేకపోతే కాస్త టైమ్ తీసుకుని రిజైన్ చేయండి. 

ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!

సెలవులు వేస్ట్ చేయవద్దు
జాబ్‌కి రిజైన్ చేశాక నోటీస్ పీరియడ్‌లో ఉంటే సెలవులు వినియోగించుకోవడానికి కుదరదు. కాబట్టి మీకు ఎన్ని సెలవులు ఉన్నాయో అన్ని వాడిన తర్వాత రిజైన్ చేయండి. దీనివల్ల మీ సెలవులు కూడా వృథా కాకుండా ఉంటాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు