రూ.23 లక్షల ప్యాకేజీ కాదని రూ.18 లక్షల ప్యాకేజీతోనే ఉద్యోగం.. ఎందుకంటే ? సాధారణంగా ప్రైవేటు ఉద్యోగులు.. వేరే కంపెనీలో ఎక్కువ వేతనంతో ఆఫర్ వేస్తే అక్కడికే వెళ్తుంటారు. ఓ ఉద్యోగి మాత్రం రూ.23 లక్షల ప్యాకెజీ ఆఫర్ వస్తే దాన్ని వదిలేసి ప్రస్తుతం ఉన్న రూ.18 లక్షల ప్యాకేజీ ఉద్యోగమే చేస్తున్నాడు.ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 12 Oct 2024 in నేషనల్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి సాధారణంగా ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు.. వేరే కంపెనీలో ఎక్కువ వేతనంతో ఆఫర్ వేస్తే అక్కడికే వెళ్తుంటారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం అలాంటి ఆఫర్‌ను వదులుకున్నాడు. తక్కువ జీతంతో ఉన్న ఉద్యోగంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ఆయన ఆలోచన విధానం మాత్రం అందరినీ ఆలోచింపజేసేలా చేస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కటారియా అనే ఓ వ్యక్తి తన లింక్డిన్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. అందులో ఇలా రాసుకొచ్చాడు. '' నా మిత్రుడికి ఏడాదికి రూ.23 లక్షల ప్యాకేజితో జాబ్ ఆఫర్ వచ్చింది. కాన్ని అతను దాన్ని రిజెక్ట్ చేశాడు. ప్రస్తుతం అతను రూ.18 లక్షల వార్షిక ప్యాకేజ్‌తో చేస్తున్న పాత ఉద్యోగాన్నే ఎంచకుకున్నాడు. ఇలా ఎందుకు చేశాడనే డౌట్ వచ్చింది. దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అసలు మ్యాటర్ అర్ధమయ్యింది. Also Read: విమాన ప్రమాదాలు.. గాల్లోనే పోతున్న ప్రాణాలు ప్రస్తుతం నా ఫ్రెండ్ ఓ హెబ్రిడ్ వర్క్ కల్చర్ కంపెనీలో రూ.18 లక్షల జీతంతో జాబ్ చేస్తున్నాడు. ఈ కంపెనీలో వారానికి ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది. ఈ ఉద్యోగంలో పనితో పాటు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది. కానీ రూ.23 లక్షలు వచ్చే ఉద్యోగంలో మాత్రం వారంలో ఆరు రోజులు పనిదినాలు ఉంటుంది. ఇది వ్యక్తిగత సమయాన్ని కూడా పనికే పరిమితం చేసేలా చేస్తోంది. అందుకే నా స్నేహితుడు తన కుటుంబం, స్నేహితులతో గడిపేందుకు అనూకలంగా ఉందనే పాత ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నాడు. చాలామంది ఉద్యోగం, వ్యక్తిగత జీవితం.. ఇవి రెండు కూడా బ్యాలెన్స్ చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ పోటీ ప్రపంచంలో అభివృద్ధి చేందేందుకు జీతం ఎంత ముఖ్యమే.. ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని'' కటారియా రాసుకొచ్చారు. #telugu-news #national-news #health #job మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి