/rtv/media/media_files/2025/04/19/vwWHWx3CzWC9IPCK20Ms.jpg)
AIG Hospital
AIG Hospital : హైదరాబాద్ బంజారాహిల్స్ లో యువతి హల్ చల్ చేస్తోంది. సిటీ సెంటర్ మాల్ పక్కనే ఉన్న ఏఐజి ఆసుపత్రి భవనం పైకి ఎక్కిన ఓ యువతి దూకుతానంటూ బెదిరిస్తోంది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఆ యువతిని కిందకు దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కిందకు దిగాలని, సమస్య ఏంటో చెప్పాలని ఆసుపత్రి సిబ్బందితో పాటు, పోలీసులు ఎంత వేడుకున్నా ఆ యువతి ఏ మాత్రం చెప్పకుండా అలాగే నిల్చొని చూస్తోంది.ఎవ్వరూ దగ్గరికి రావొద్దంటూ శివలీల షరతు విధించింది.
Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసుల వివరాల ప్రకారం.. ఏఐజీ ఆసుపత్రి బిల్డింగ్‌లో సదరు యువతి కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం.యువతిని అదే ఆసుపత్రిలో పని చేస్తున్న శివలీలగా పేర్కొన్నారు. ఇటీవలే శివలీలను యాజమాన్యం ఉద్యోగంలోంచి తీసేసినట్లు తెలుస్తోంది.తిరిగి ఉద్యోగం ఇవ్వాలని శివలీల డిమాండ్ చేస్తోంది.సడన్‌గా ఆమెను విధుల్లోంచి తొలగించడంతో తట్టుకోలేక ఆత్మహత్యయత్నానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Also read: Hyderabad: నగరంలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!
Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
ఆసుపత్రి భవనం ప్రధాన రహదారిపై ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాగార్జున సర్కిల్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆ యువతిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. యువతితో ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని కిందకు దిగిరావాలని కోరుతున్నారు. కాగా రెండున్నర గంటలపాటు అందరినీ ముప్పుతిప్పలు పెట్టిన శివలీల ఎట్టకేలకు పోలీసుల హామీతో కిందకు దిగింది.
Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు