ఎవరైనా సరిగా పనిచేయనప్పుడు, గోడవలు పెట్టుకున్నప్పుడు, ఇంకా ఇతరాత్ర కారణాల వల్ల ప్రైవేటు కంపెనీలు సాధారణంగా ఉద్యోగులను తొలగిస్తాయి. అయితే లండన్‌లో ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఉద్యోగికి కంపెనీ 30 వేల పౌండ్లు (రూ.32,20,818) చెల్లించాలని ఉద్యోగ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Also Read: మా నాన్న చనిపోతే ఏం చేశారు.. కాంగ్రెస్‌పై ప్రణబ్ ముఖర్జీ కూతురు సంచలన ఆరోపణలు.. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎలిజబెత్ బెనాస్సీ (18) అనే యువతి 2022లో లండన్‌లోని మ్యాక్సిమస్ యూకే సర్వీసెస్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అయితే కొన్నిరోజుల తర్వాత ఆమె డ్రెస్ కోడ్ పాటించకుండా స్పోర్ట్స్ షూ వేసుకొచ్చింది. దీంతో ఆ కంపెనీ ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో ఆ యువతి ఉద్యోగ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. కంపెనీకి డ్రెస్ కోడ్ ఉందనే విషయం తనకు తెలియదని పేర్కొంది. తెలియకుండా షూ వేసుకెళ్లినందుకు ఓ మేనేజర్ తనను తిట్టారంటూ కూడా చెప్పింది. Also Read: చెన్నై గ్యాంగ్ రేప్ ఘటన.. నిందితుడికి డీఎంకేతో సంబంధాలు ! కంపెనీ కూడా ట్రైబ్యునల్‌లో తమ వాదనలు వినిపించింది. ఈ విషయంలో తమ తప్పు లేదని చెప్పింది. ఇరువైపు వాదనలు విన్న ట్రైబ్యునల్ ఆ ఉద్యోగురాలి వైపే అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమెకు కంపెనీ రూ.32 లక్షల పరిహారం ఇవ్వాలన ఆదేశించింది. '' ఆమె ఉద్యోగంలో కొత్తగా చేరింది. డ్రెస్ కోడ్ గురించి ఆమెకు తెలిసుండకపోవచ్చు. ఇంతదానికే మరో అవకాశం కూడా ఇవ్వకుండా ఆమెను ఉద్యోగంలోని తొలగించడం అన్యాయమని పేర్కొంది. Also Read: తండ్రి మోసం కూతురి మరణం కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్! Also Read: స్టుపిడ్ షాట్.. గెట్‌అవుట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ రూమ్: సన్నీ ఫైర్