Terrorist Attack: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.. 10 మంది మృతి
జమ్ము కశ్మీర్లోని రియాసి జిల్లాలో ఉగ్రవాదుల దాడి జరిగింది. యాత్రికుల బస్సుపై ముష్కరులు కాల్పులు జరపడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి.