జమ్మూ కశ్మీర్‌లో రాజౌరీ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని వ్యాధి సోకి 8 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. గత కొన్నిరోజులుగా ఈ మరణాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ చిన్నారి కూడా ఆస్పత్రిలో మరణించింది. రోజురోజుకి ఈ వ్యాధి వల్ల మరణాలు పెరగడం ఆందోళన రేపుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి గురించి దర్యాప్తు చేసేందుకు కేంద్ర నిపుణుల బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ వ్యాధి వల్ల మరణించిన వాళ్లలో ఏడుగురు 14 ఏళ్లులోపు వారే ఉన్నారు. Also Read: నాతో రాహుల్ గాంధీ అసభ్యంగా ప్రవర్తించారు.. మహిళా ఎంపీ ఆరోపణలు! అంతేకాదు మృతి చెందినవాళ్లందరూ కూడా కోట్రంక తహసీల్‌లోని బదాల్ గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం. పైగా ఇందులో ఇందులో రెండు కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. అఫ్షాక్ అహ్మద్ అనే 12 ఏళ్ల బాలుడు అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ బాలుడు గుర్తుతెలియని వ్యాధికి గురై గత 6 రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. Also Read: ముంబయ్ మారణహోమం నిందితుడి పిటిషన్ కొట్టేయాలని కోరిన అమెరికా అంతకుముందు అఫ్ఫాక్ సోదరుడు ఇఫ్తియాక్ (7), సోదరి నజియా(5)తో సహా మరో ఐదుగురు కూడా ఈ వ్యాధి మూలంగానే మరణించారు. అయితే వైద్యులకు కూడా ఈ వ్యాధి అంతుచిక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఈ వ్యాధి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానికులందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. Also Read: భార్యను 72 మందితో రేప్ చేయించిన దుర్మార్గుడు.. ఫుడ్‌లో మత్తుమందు కలిపి Also Read: అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం