జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని గ్రనేడ్ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. By B Aravind 03 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని గ్రనేడ్ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. శ్రీనగర్‌లోని టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ (TRC)కు సమీపంలో ఆదివారం జరిగే వార సంతలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటన అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉగ్రవాదుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. Also Read: 85 లక్షల వాట్సప్ అకౌంట్స్ బ్లాక్! రెండు చోట్ల కాల్పులు శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలోని లష్కరే తోయిబా (LET)కు చెందిన పాకిస్థానీ అగ్ర కమాండర్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఓ రోజు తర్వాత ఈ దాడి జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను కూడా మోహరించారు. అలాగే అనంత్‌నాగ్ జిల్లాలోని షాంగస్ - లర్నూ ప్రాంతంలో జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మొదటి కాల్పులు శ్రీనగర్‌లో జరగగా.. రెండోది అనంతనాగ్‌లో జరిగింది. Also Read: ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు ముగ్గురు ఉగ్రవాదులు ఖతం జమ్ముకశ్మీర్ చేపట్టిన ఈ సెర్చ్ ఆపరేషన్‌లో భారత సైన్యం శనివారం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. లష్కరే తోయిబాకు చెందిన అగ్ర కమాండర్ ఉస్మాన్‌న్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఉస్మాన్.. దశాబ్ద కాలంగా కశ్మీర్‌లో చురుకుగా పనిచేశాడని.. ఇన్‌స్పెక్టర్ మస్రూర్ వానీ హత్యలో కూడా అతడి ప్రమేయం ఉందని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈద్గా మైదానంలో మస్రూర్ వానీని ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. #jammu-kashmir #telugu-news #national-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి