/rtv/media/media_files/2025/12/14/fotojet-6-2025-12-14-12-27-42.jpg)
ISIS gave America a big shock
US SOLDIERS : సిరియాలో అమెరికన్ సైన్యంపై ఇస్లామిక్ స్టేట్(islamic-states) (ఐసిస్) ఆకస్మిక దాడి చేసింది. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక పౌర అనువాదకుడు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అమెరికా(america) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీవ్రంగా స్పందించారు. దీనికి చాలా తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు.
BREAKING:
— Visegrád 24 (@visegrad24) December 13, 2025
3 U.S. soldiers shot and wounded in an ambush in Syria during an anti-ISIS patrol near Palmyra.
The soldiers have been airlifted to the Al-Tanf base on the border with Iraq and Jordan pic.twitter.com/xWrlNc37RV
Also Read : మచాదో కోసం అమెరికా రహస్య ఆపరేషన్..వేషం మార్చి నార్వేకు..
ISIS Gave Big Shock To America
శనివారం జరిగిన ఈ దాడిలో మరో ముగ్గురు సైనికులు గాయపడినట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో తెలిపారు. ఐసిస్‌ను నిర్మూలించేందుకు అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఇన్హెరెంట్ రిజాల్వ్’లో భాగంగా ఈ సైనికులు పనిచేస్తున్నారు. పాల్మైరా ప్రాంతంలో కీలక నేతలతో సమావేశమవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది.
గతేడాది డిసెంబర్‌లో బషర్ అల్-అస్సాద్ అధికారం కోల్పోయిన తర్వాత సిరియా(siriya) లో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. దాడికి పాల్పడిన వ్యక్తి సిరియా ప్రభుత్వ దళాలకు చెందిన సైనికుడేనని అక్కడి ప్రభుత్వం అంగీకరించడం గమనార్హం. అయితే, అతడిని ఇప్పటికే మట్టుబెట్టామని, అంతర్గత భద్రతా విభాగంలో అతడికి ఎలాంటి నాయకత్వ పాత్ర లేదని సిరియా ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు. పాల్మైరా ప్రాంతంలో ఐసిస్ దాడి జరిగే ప్రమాదం ఉందని తాము ముందే అమెరికాను హెచ్చరించినా వారు పట్టించుకోలేదని సిరియా ఆరోపించింది.
ఈ దాడి జరిగిన ప్రాంతం సిరియా కొత్త ప్రభుత్వ పూర్తి నియంత్రణలో లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా తీవ్ర ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఇటీవలే అల్-షరా వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. తాజా పరిణామం ఇరు దేశాల మధ్య సహకారానికి
కాగా ఐఎస్‌ఐఎస్ ముష్కరుడిని అమెరికన్ బలగాలు వెంటనే ఎదుర్కొని మట్టుబెట్టాయి. ఈ దాడులు సిరియాలోని పాల్మైరా సమీపంలో జరిగాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొంటున్న సైనికులపై ఈ ఆకస్మిక దాడి జరిగింది. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ, ఇది ISIS దాడి అని ధృవీకరించారు. దీనికి తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. మరణించిన ముగ్గురిని అమెరికన్ దేశభక్తులుగా ట్రంప్ అభివర్ణించారు. గాయపడిన సైనికులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పరీక్షగా నిలిచింది.
Also Read : పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. దేశవిభజన తరువాత తొలిసారిగా..
Follow Us