PM Modi: బంగ్లాదేశ్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ..? కారణం ఇదే

బంగ్లాదేశ్‌లో BNP ఛైర్మన్ తారిక్ రెహమాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని మోదీతో పాటు పలు దేశాల నేతలకు ఆహ్వానం పంపించాలని బీఎన్‌పీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
PM Modi

PM Modi

బంగ్లాదేశ్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్ పార్టీ (BNP) గెలిచిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని ఖాలిదా జియా కొడుకు, బీఎన్‌పీ ఛైర్మన్ తారిక్ రెహమాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. దీంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికే పనులు మొదలయ్యాయి. అయితే ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని మోదీతో పాటు పలు దేశాల నేతలకు ఆహ్వానం పంపించాలని బీఎన్‌పీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.  

Also Read: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. తెలంగాణకు గుడ్‌న్యూస్

ప్రధాని మోదీ ఒకవేళ బంగ్లాదేశ్‌కు వెళ్తే.. ఇరు దేశాల సంబంధాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే ఛాన్స్ ఉంది. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్‌కు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు పలువురు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మరీ ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌కు వెళ్తారా ? లేదా? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే బీఎన్‌పీ విజయంపై ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అలాగే తారిక్‌ రెహమాన్‌కు ఫోన్‌ చేసి అభినందించారు. ఆయన నాయకత్వంపై ప్రజల నమ్మకానికి ఈ ఎన్నికలే నిదర్శమని తెలిపారు. బీఎన్‌పీ కూడా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపింది. 

Also Read: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిక్‌ రెహమాన్‌.. ఈయన్ని డార్క్‌ ప్రిన్స్ అని ఎందుకంటారో తెలుసా ?

Advertisment
తాజా కథనాలు