/rtv/media/media_files/2026/02/15/imran-khan-2026-02-15-19-09-26.jpg)
Pakistan secretly moving Imran Khan from jail?
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జైలు అధికారులు ఆయన్ని సీక్రెట్‌గా ఓ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన బయటికి రాలేదు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (PTI) పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 2023 ఆగస్టు నుంచి రావల్పిండిలోని అడియా జైలులో ఆయన ఉంటున్నారు. ఇటీవల జైలు అధికారులు తన కుటుంబ సభ్యులను కూడా కలిసేందుకు పర్మిషన్ ఇవ్వలేదు.
Also Read: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
ఇప్పటికే ఆయన చాలావరకు ఓ కంటిచూపు కోల్పోయినట్లు ప్రచారం నడుసేతోంది. జైలులో ఆయనపై పలు రకాల దాడులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తాజాగా ఆయన్ని రహస్యంగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే ఎవరికీ తెలియకుంటే చికిత్స అందించడంపై పీటీఐ నేతలు మండిపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వాలెంటైన్స్ డే రోజున ప్రియుడితో భార్య.. భర్త చేసిన పనికి అందరూ షాక్
దీనివల్ల ఆయన ప్రాణాలకే ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఎలాంటి చికిత్స చేసినా కూడా వాళ్ల కుటుంబ సభ్యుల పర్మిషన్‌తోనే, ఫ్యామిలీ డాక్టర్ సమక్షంలో జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన విషయంలో ప్రభుత్వం పాటిస్తున్న తీరు ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని విమర్శిస్తున్నారు. ఇదిలాఉండగా ఇమ్రాన్‌ఖాన్‌ను త్వరలో ఇస్లామాబాద్‌లో నూతనంగా నిర్మించనున్న జైలుకు తరలించనున్నారు. మరో రెండు నెలల్లో ఆ జైలు నిర్మాణం పూర్తవుతుందని పాక్ మంత్రి ఒకరు తెలిపారు. అక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
Follow Us