/rtv/media/media_files/2026/02/15/pak-army-chief-asim-munir-2026-02-15-14-48-34.jpg)
Pak Army chief Asim Munir nearly stopped for ID check at Munich summit in Germany
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. జర్మనీలో ఓ కార్యక్రమానికి పాల్గొనేందుకు వెళ్లిన ఆయన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మ్యునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అసిమ్ మునీర్ తన టీమ్‌తో కలిసి జర్మనీకి వచ్చారు. వేదిక వద్దకు వెళ్తుండగా భద్రతా అధికారిని ఆయన్ని ''ఆగండి, మీ ఐడీ కార్డును చూపించండి'' అని అన్నారు. దీంతో మునీర్ కాస్త ఇబ్బంది పడ్డారు.
Also Read: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారానికి డేట్ ఫిక్స్.. ఇండియా ప్రధాని మోదీకి ఆహ్వానం
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఇది దౌత్యపరమైన ఇబ్బంది అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు ఆయనకు ఇది అవమానం అంటున్నారు. ఉన్నతస్థాయి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇలాంటి ప్రొటోకాల్ సాధారణమేనని ఇంకొందరు అంటున్నారు. ఈ ఘటనపై పాక్ మాజీ సైనికాధికారి ఆదిల్ రజా స్పందించారు. ప్రపంచ వేదికలపై అసిమ్ మునీర్‌ను ఎవరూ గుర్తించరని విమర్శలు చేశారు. గేట్ కీపర్లు అడిగినా అతడు తనకు తాను పరిచయం చేసుకుంటారని సెటైర్లు వేశారు.
UPDATE!!
— HTN World (@htnworld) February 14, 2026
Field Marshal Army Chief Asim Munir arrives for Munich Security Conference in Germany pic.twitter.com/v4PQpW4z77
Also Read: రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ క్లారిటీ.. అమెరికాకి హామీ!
ఇదిలాఉండగా ఈ కార్యక్రమానికి అసిమ్ మునీర్‌ను ఆహ్వానించడంపై జర్మనీలో వ్యతిరేకత వస్తోంది. పాకిస్థాన్ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని పలు రాజకీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి. జర్మనీలోని సింధీ రాజకీయ సంస్థ జై సింధ్ ముత్తాహిదా మహాజ్(JSMM) కార్యక్రమ వేదిక వద్ద నిరసనలు తెలిపింది.
Follow Us