/rtv/media/media_files/2026/02/10/us-lawmaker-introduces-bill-to-end-h-1b-visa-programme-2026-02-10-19-30-07.jpg)
US lawmaker introduces bill to end H-1B visa programme
అమెరికాలో ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులకు బిగ్ షాక్ తగిలింది. హెచ్1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్టూబ్.. ప్రతినిధుల సభలో బిల్లను ప్రవేశపెట్టారు. . ‘ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్స్ యాక్ట్’ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో సవరణలు చేసి H1బీ వీసా విధానాన్ని తొలగించడమే ఈ బిల్లు ఉద్దేశం. అమెరికా పౌరుల ప్రయోజనం, సంక్షేమం కన్నా విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని గ్రెగ్ స్టూబ్ వాదనలు వినిపిస్తున్నారు.
Also Read: సోషల్ మీడియా సంస్థలకు షాక్.. ఏఐ కంటెంట్‌పై కేంద్రం కీలక ఆదేశాలు
కార్పొరేట్ సంస్థలు తక్కువ జీతాలకు వీదేశీయ కార్మికులను తెచ్చుకొని అమెరికా యువతకు రావాల్సిన ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అమెరికా ప్రజల కోసం అమెరికన్ డ్రీమ్‌ను కాపాడేందుకు ఈ దోపిడీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అందుకే ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారినట్లయితే అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే లక్షలాది మంది భారతీయులు వెనక్కి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
Also Read: బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందూ వ్యాపారి హత్య
మరోవైపు H1బీ వీసా తీసుకుంటున్న వాళ్లలో 80 శాతానికి పైగా భారతీయులు, చైనీయులే ఉన్నారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ఈ వీసాకు సంబంధించిన రూల్స్‌ను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. కొత్త వీసాలపై లక్ష డాలర్ల భారీ రుసుమును విధించింది. అలాగే లాటరీ విధానానికి బదులుగా ఎక్కువ వేతనం ఉండే ఉద్యోగులకే వీసా అందించనున్నారు. తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు మాత్రం వీసా ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచే ఈ రూల్ అమల్లోకి రానుంది. అయితే ఇప్పుడు హెచ్1బీ వీసా కార్యక్రమాన్ని రద్దు చేసే బిల్లును ప్రవేశపెట్టడంతో అమెరికాకు వెళ్లాలనుకునే, అలాగే అక్కడ ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
Follow Us