UAE: యూఏఈ సంచలన నిర్ణయం.. స్కూళ్లలో అవి నిషేధం

పిల్లల ఆరోగ్యానికి సంబంధించి యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో ఉండే క్యాంటీన్లు, పరిసర ప్రాంతాల్లో జంక్‌ఫుడ్ అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

New Update
UAE schools ban sugary snacks and fizzy drinks on campus

UAE schools ban sugary snacks and fizzy drinks on campus

ఈ మధ్యకాలంలో జంక్‌ ఫుడ్‌ తినేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వీటికి అలవాటు పడిపోయిన చాలామంది లేని రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లల ఆరోగ్యానికి సంబంధించి యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో ఉండే క్యాంటీన్లు, పరిసర ప్రాంతాల్లో జంక్‌ఫుడ్ అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా చూసుకుంటే పిల్లలు ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్‌, ఇతర తీపి పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ను ఇష్టపడుతారు. కానీ వీటిని తినడం వల్ల ఆ వయసులో కలిగే నష్టాల గురించి వాళ్లకు తెలియదు. 

Also Read: మాజీ ఆర్మీ చీఫ్ నరవణే బుక్‌ వివాదం.. ఆ బుక్‌లో ఏముందో తెలుసా ?

ఈ క్రమంలోనే పిల్లలకు క్రమశిక్షణను పెంచడంతో సహా వాళ్ల ఆరోగ్య రక్షణను మెరుగుపర్చేందుకు UAE విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో ఉండే క్యాంటీన్‌లతో పాటు పరిసర ప్రాంతాల్లోని జంక్‌ఫుడ్‌ను నిషేధిస్తూ ఆదేశించింది. అలాగే ఎలాంటి ఎనర్జీ డ్రింక్స్‌, స్వీట్స్‌, చాక్లెట్‌లు, నూడల్స్‌, కేకులు ఇతర తీపి వస్తువులు పాఠశాల పరిసర ప్రాంతాల్లో విక్రయించకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు లాంటివి పంపించాలని సూచనలు చేసింది. మరీ ముఖ్యంగా పిల్లలు స్కూళ్లకు ఫోన్‌లను తీసుకురాకూడదని ఆదేశించింది. 

Also Read: కెనడాకు అమెరికా వార్నింగ్.. ఆ వంతెనను బ్లాక్ చేస్తామంటూ హెచ్చరిక

ఒకవేళ వాళ్లు స్కూల్‌కు ఫోన్ తీసుకొస్తే.. మొదటిసారి ఒకనెల వరకు ఫోన్‌ జప్తు చేస్తామని చెప్పింది. మళ్లీ తీసుకొస్తే విద్యా సంవత్సరం చివరిదాకా మొబైల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. కానీ పాఠశాల రూల్స్ ప్రకారం టాబ్స్, ఐప్యాడ్ లాంటివి వినియోగించవచ్చని తెలిపింది. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని UAE విద్యాశాఖ పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు