/rtv/media/media_files/2026/02/15/iran-ready-to-discuss-compromises-to-reach-nuclear-deal-2026-02-15-15-26-10.jpg)
Iran ready to discuss compromises to reach nuclear deal
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు అణు ఒప్పందంపై రాజీ కుదుర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమయ్యింది. అమెరికాతో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు సంకేతం ఇచ్చింది. కానీ తమ దేశంపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలంటూ షరతు పెట్టింది. ఇరాన్ మంత్రి మాజిద్ తఖ్తా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారానికి డేట్ ఫిక్స్.. ఇండియా ప్రధాని మోదీకి ఆహ్వానం
అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా కోర్టులోనే బంతి ఉందని మాజిద్ అన్నారు. ఆంక్షలు ఎత్తివేసే అంశం గురించి వాళ్లు మాట్లాడేందుకు సిద్ధమైతే.. మా అణు కార్యక్రమాలకు సంబంధించిన దానిపై మాట్లాడేందుకు రెడీగా ఉన్నామని పేర్కొన్నారు. కానీ ఇరాన్‌పై ఉన్న అన్ని ఆంక్షలు ఎత్తివేయాలా ? లేదా పాక్షికంగానే రిలీఫ్ కోరుకుంటున్నారా అనేది ఆయన క్లారిటీగా చెప్పలేదు. మొత్తానికి ఆంక్షలు ఎత్తివేస్తే అణు ఒప్పందంపై రాజీ కుదుర్చుకునేందుకు తాము సిద్ధమనే సంకేతాన్ని ఇరాన్ సూచిస్తోంది.
Also Read: అమెరికా అడవుల్లో భారతీయ విద్యార్థి డెడ్‌బాడీ.. ఆరు రోజులుగా మిస్సింగ్..?
మరోవైపు ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో ఇరాన్ ఒప్పందానికి రాకపోతే సైనిక చర్యలకు దిగుతామని హెచ్చరించారు. అణు కార్యక్రమానికి సంబంధించి ఇరుదేశాల మధ్య ఒమన్ వేదికగా పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. ఇవి సానుకూలంగానే ఉన్నాయని మాజిద్ తెలిపారు. త్వరలో రెండో రౌండ్ చర్చలు కూడా మొదలవుతాయని పేర్కొన్నారు. అయితే అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. తమపై ఆంక్షలు ఎత్తివేస్తేనే ఈ ఒప్పందంపై మాట్లాడుతామని ఇరాన్ చెబుతోంది. మరీ అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Follow Us