తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు!
తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు అందించారు. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేశామని, లబ్ది దారులందరికీ న్యాయం చేస్తామన్నారు.