తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు!

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అర్హులందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కేలా చూడాలని సూచించారు.

New Update
drerer

TG News: తెలంగాణ పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ‌/ వార్డు, మండ‌ల/ ప‌ట్టణ‌, నియోజ‌క‌వ‌ర్గ, జిల్లా స్థాయి క‌మిటీల ఏర్పాటుకు విధివిధినాలు రెండు రోజుల్లో రూపొందించాల‌ని, అర్హులందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కేలా చూడాలని సూచించారు. రాష్ట్ర స‌చివాల‌యంలో బుధవారం స‌మీక్ష నిర్వహించిన సీఎం.. ప్రధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న నుంచి ఇత‌ర రాష్ట్రాలు ల‌క్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకున్నట్లు తెలిపారు. అయితే తెలంగాణ మాత్రం ఈ విషయంలో వెనుక‌బ‌డి ఉంద‌న్నారు. 

కేంద్ర నుంచి బకాయిలు రాబట్టండి..

ఈసారి కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గ‌రిష్ట సంఖ్యలో రాష్ట్రానికి ఇళ్లు సాధించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావ‌ల్సిన బ‌కాయిలు రాబ‌ట్టాల‌న్నారు. కేంద్రానికి దీనిపై స‌మాచారం ఇవ్వాల‌ని, ఇందిర‌మ్మ ఇళ్ల డాటాను 00 అప్‌డేట్ చేయాల‌న్నారు. భారీ సంఖ్యలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజినీరింగ్ సిబ్బంది స‌మ‌స్య ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. దీంతో అవ‌స‌ర‌మైతే ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధతిన నియామ‌కాలు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు.

ఇక రాష్ట్రంలో నిరుప‌యోగంగా ఉన్న రాజీవ్ స్వగృహలను వేలం వేయాల‌ని చెప్పారు. ఏళ్ల త‌ర‌బ‌డి వృథాగా ఉంటున్న వాటిని వెంట‌నే వేలానికి రంగం సిద్ధం చేయాల‌ని చెప్పారు. గతంలో ల‌బ్ధిదారులకు ఎందుకు ఇళ్లు ఇవ్వలేదని అధికారులను ప్రశ్నించారు. అర్హుల‌కు ఆ ఇళ్లను అప్పగించాల‌ని ఆదేశించారు. ఈ స‌మావేశంలో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, వేం న‌రేంద‌ర్ రెడ్డి, శాంతి కుమారి తదితర అధికారులు పాల్గొన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు