ఇందిరమ్మ ఇళ్ల స్థలాలపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన..

తెలంగాణలో స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు ముందుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో దశలో స్థలం లేని వాళ్లని కూడా గుర్తిస్తామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Ponguleti 2

తెలంగాణలో స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు ముందుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో దశలో స్థలం లేని వాళ్లని కూడా గుర్తిస్తామని తెలిపారు. వారికి స్థలం కేటాయించి ఇళ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. నవంబర్ 6వ తేదీ నుంచి క్షేత్రస్తాయిలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని.. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా రూపొందించినట్లు పేర్కొన్నారు. నవంబర్ 15 నుంచి 20 తేదీల మధ్య గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని గుర్తిస్తామని తెలిపారు. 

Also Read: ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

స్థలాలు లేకుంటే భూమి కేటాయిస్తాం

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 75 నుంచి 80 గజాల స్థలాన్ని లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. స్థలాలు అందుబాటులో లేనిచోట భూమిని కొని కేటాయిస్తామన్నారు. నిర్మాణాల కోసం మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్ల వల్లే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రాబోయే నాలుగేళ్ల పాటు రేవంత్‌ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పేదరికమే ప్రామాణికంగా తీసుకుంటామని.. ఇంటి యజమానురాలి పేరుపైనే మంజూరు చేస్తామని అన్నారు. బిల్లులు చెల్లిస్తామని అన్నారు. 

Also Read : పెరుగు ఎక్కువగా తిన్నా ప్రమాదమేనా?

అలాగే ఇంటి నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసే ఆలోచన ఉందని తెలిపారు. స్టీలు, సిమెంటు తదితరకు రాయితీ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోందని అన్నారు. '' మొదటి దశలో ప్రతీ నియోజకవర్గానికీ 3,500 ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గృహజ్యోతి కింద అసంపూర్తిగా వదిలేసిన 680 ఇళ్లలో అర్హులకు సహకరిస్తాం. గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందినవాళ్లకి ఈసారి కేటాయింపులు ఉండవు. కేటాయింపుల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఇచ్చే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఇందిరమ్మ కమిటీలే లబ్ధిదారులను గుర్తిస్తాయి.  

Also Read: యూపీ సీఎంకు బెదిరింపులు.. సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ..

గుర్తించిన లబ్ధిదారులను తహశీల్దార్‌ ధ్రువీకరిస్తారు. అర్హులను ఎంపిక చేయడంలో గ్రామసభల నిర్ణయమే ఉంటుంది. ఇందులో రాజకీయ జోక్యం ఉండదు. ఐదేళ్లలోనే రాష్ట్రంలో రూ.28 వేల కోట్లతో 20 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నాం. వచ్చే ఏడాది మార్చి లోపు రూ.7,740 కోట్లు కేటాయిస్తాం. గృహ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల సాయం చేస్తుంది. కానీ 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా నిర్మాణం చేపట్టాలి. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితిని బట్టి మెరుగ్గా కూడా కట్టుకోవచ్చని'' మంత్రి పొంగులేటి అన్నారు.  

Also Read :  వేడి నీటిలో పాదాలు ఉంచితే మైగ్రేన్ పోతుందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు