Ponguleti : ఒక బాత్రూం, కిచెన్ తప్పనిసరి.. ఇందిరమ్మ ఇళ్ల రూల్స్ ఇవే! మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు.లబ్దిదారుడు 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాలన్నారు. By Bhavana 14 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Telangana: ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడతలో స్థలం ఉన్నవారికి మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. లబ్దిదారుడు 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాలన్నారు. అందులో ఓ బాత్రూమ్, వంట గది తప్పనిసరిగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఇల్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారునికి ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ. 5 లక్షలు ఇస్తుందని తెలిపారు. పునాది నిర్మాణం పూర్తి కాగానే రూ. లక్ష, లెంటల్ లెవల్‌కు చేరగానే రూ.1.25 లక్షలు, స్లాబు వేశాక రూ. 1.75 లక్షలు, గృహప్రవేశం సమయంలో మిగిలిన లక్ష రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. Also Read: Karnataka: 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున..బీజేపీ బంపరాఫర్! గ్రామ సభలను నిర్వహించి పేదల్లో బహుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని, ఇంటిని ఇంటి యజమానురాలి పేరు మీదే ఇస్తామని తెలిపారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించిన వినతిపత్రాలే అధికంగా వచ్చాయని తెలిపారు. Also Read: Hydrogen Train: త్వరలో ఈ మార్గంలో నీటితో నడిచే హైడ్రోజన్ ట్రైన్! డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నమూనాలు చూపించి గెలిచిన బీఆర్‌ఎస్ పార్టీ.. పదేళ్లు అధికారంలో ఉండి ఇళ్లను కట్టించలేదని ఆరోపించారు. అలాగే ధరణి సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపైనా వినతులు వచ్చినట్లు తెలిపారు. కొత్త ఆర్వోఆర్ ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దడం పూర్తి అయ్యిందని తెలిపారు. త్వరలోనే దేశానికే రోల్ మోడల్‌గా నిలిచే కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. Also Read: Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..16 వేల ఉద్యోగాల భర్తీ! గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో కనుసైగలతో ప్రభుత్వ స్థలాలను తమ పేరిట మార్చుకున్నారని, ఆ స్థలాలను తిరిగి తీసుకుని పేదవాళ్లకు ఇస్తామని పేర్కొన్నారు. Also Read: Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! కొంత మంది అర్హులైన రైతులకు రూ.13 వేల కోట్ల మేరకు రుణాలను మాఫీ చేయాల్సి ఉందని, డిసెంబరు నెలలోపున ఆ రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పండిన ధాన్యం చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వివరించారు. #telangana #indiramma-houses #ponguleti-srinivas-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి