ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక.. రేపే యాప్‌ ప్రారంభం: పొంగులేటి

ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల‌ ఎంపిక పారదర్శకంగా జరిగేలా మొబైల్‌ యాప్‌ రూపొందించామని మంత్రి పొంగులాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం సీఎం రేవంత్ దీన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
pon

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల‌ ఎంపికకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం అమ‌లుకు ఉన్న అవ‌రోధాల‌ను అధిగ‌మిస్తూ అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను వేగవంతం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. '' ఇళ్లు లేని పేద‌ల‌కు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ల‌బ్దిదారుల ఎంపిక పార‌దర్శకంగా ఉండేలా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా మొబైల్ యాప్‌ను రూపొందించాం. సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఈ యాప్‌ను ఆవిష్కరించనున్నారు. 

Also Read: తెలంగాణలో గూగుల్‌ భారీ పెట్టుబడులు.. టోక్యో తర్వాత హైదరాబాద్‌లోనే

మహిళల పేరు మీద ఇళ్లు మంజూరు

లబ్దిదారుల ఆర్థిక పరిస్థితి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి వివరాలు వంటి అంశాలు ఈ యాప్‌లో ప్రధానంగా ఉండనున్నాయి. అర్హులైన పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మించేందుకు వీలుగా ప్రతి గ్రామం, వార్డుల‌లో ఇందిర‌మ్మ ఇళ్ల కమిటీల‌ను ఏర్పాటు చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. మహిళ పేరు మీద ఇళ్లు మంజూరు చేస్తున్నాం. ఈ ఇళ్లకు నాలుగు దశల్లో లబ్దిదారులకు చెల్లింపులు చేస్తాం. 

400 అడుగుల విస్తీర్ణంతో

మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్దిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. ఈ పథకం కింద నిర్మించే ఇళ్లు క‌నీసం 400 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం, వంట‌గ‌ది, టాయిలెట్ సౌక‌ర్యాల‌ను క‌లిగి ఉంటాయి. గ‌త ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవ‌స్థ ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థను ర‌ద్దుచేసి లబ్దిదారులే ఇళ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నాం. లబ్దిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చ‌ద‌ర‌పు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ  మోడల్ హౌస్ నిర్మాణాలను చేపడతాం.

Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!

ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో 2006-2007లో ఇందిర‌మ్మ ఇళ్లను ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలో 2006-2007 నుంచి 2014 వ‌ర‌కు 23,85,188 ఇళ్లను మంజూరు చేయ‌గా 19,32,001 ఇళ్లను పూర్తి చేసింది. 4,53,187 ఇళ్లు వివిధ ద‌శ‌ల్లో నిర్మాణంలో ఉండ‌గా బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని గాలికి వ‌దిలేసిందని'' పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు