Hydrogen Train: త్వరలో ఈ మార్గంలో నీటితో నడిచే హైడ్రోజన్ ట్రైన్!
దేశంలో త్వరలోనే హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రానుంది. హర్యానాలోని జింద్ - సోనిపట్ మార్గంలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
దేశంలో త్వరలోనే హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రానుంది. హర్యానాలోని జింద్ - సోనిపట్ మార్గంలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించేలా అన్ని సేవలను ఒకే యాప్లో పొందేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఓ ‘సూపర్ యాప్’ను తీసుకొస్తుంది. డిసెంబర్ చివరి నాటికి ఈ యాప్ లాంచే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
దానా తుపాను దూసుకొస్తోంది. వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఏపీలో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే మొత్తం 37 రైళ్లను రద్దు చేసింది ఇండియన్ రైల్వే.
పండుగల సీజన్ కావడంతో భారతీయ రైల్వే దాదాపు 6,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. 108 రైళ్లకు అదనపు జనరల్ కోచ్లు జత చేశారు.
హనుమకొండలోని హసన్పర్తి రోడ్ నుంచి కరీంనగర్ వరకు కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణానికి సంబంధించి అధికారులు డీపీఆర్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1400 కోట్లు అవుతుందని అంచనా.
భారతీయ రైల్వేశాఖ నుంచి మరో భారీ నోటిఫికేషన్ వెలువడనుంది. 11,250 టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సమాచారం.
భారత రైల్వే శాఖ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా రైళ్లంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏ రైలు రద్దు అవుతోందో? ఏ ట్రైన్ ఏ టైమ్ కు వస్తుందో? తెలియని దుస్థితి ఏర్పడింది. భారీగా ట్రైన్ సర్వీసుల రద్దు.. నిర్వహణ లోపమే ఇందుకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక నుంచి రైలు ప్రయాణంలో కన్ఫార్మ్ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తప్పవంటుంది రైల్వే శాఖ. వెయింటింగ్ టికెట్ తో రైలులో ప్రయాణం చేస్తే జరిమానా తో పాటు కఠిన చర్యలు కూడా తీసుకుంటామని రైల్వేశాఖ హెచ్చరికలు జారీ చేసింది.