Railway Recruitment 2024: నిరుద్యోగులకు భారత రైల్వే మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ఇటీవలే రెండు భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఇండియన్ రేల్వే శాఖ తాజాగా మరో ఉద్యోగ ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 11,250 టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు ఆహ్వానించగా.. తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన విదివిధానాలను సెప్టెంబర్లో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Railway jobs: ఇంటర్ అర్హతతో రైల్వేలో 11,250 ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే!
భారతీయ రైల్వేశాఖ నుంచి మరో భారీ నోటిఫికేషన్ వెలువడనుంది. 11,250 టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సమాచారం.
Translate this News: