రైల్వే టికెట్లపై రాయితీ.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు భారత రైల్వేశాఖ ప్రతి రైల్వే టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఒక్కో ప్రయాణికుడు టికెట్‌పై రూ.100 ఖర్చు చేయాల్సిన చోట రూ.54 మాత్రమే వెచ్చించేలా చూస్తున్నామని స్పష్టం చేశారు. మిగతా రూ.46 రైల్వేశాఖే భరిస్తోందన్నారు. By B Aravind 04 Dec 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి పార్లమెంటులో శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పలు కీలక విషయాలను వివరించారు. అన్ని రకాల టికెట్లపై ప్రతీ సంవత్సరం రూ.56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. '' భారత రైల్వేశాఖ ప్రతి రైల్వే టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తోంది. ఒక్కో ప్రయాణికుడు టికెట్‌పై రూ.100 ఖర్చు చేయాల్సిన చోట రూ.54 మాత్రమే వెచ్చించేలా చూస్తున్నాం. Also Read: 96 రకాల సీతాకోకచిలక జాతులు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో గ్రాండ్‌గా ఈవెంట్ మిగతా రూ.46 డబ్బులు రైల్వే శాఖే భరిస్తుంది. ఈ రాయితీని అన్ని తరగతుల ప్రయాణికులకు వర్తింపజేస్తున్నామని'' అశ్వినీ వైష్ణవ్ ప్రశ్తోత్తరాల సమయంలో వెల్లడించారు. అంతేకాదు దేశంలో అత్యంత వేగవంతమైన రైల్వే సేవలపై అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానమిచ్చారు. భుజ్, అహ్మదాబాద్‌ల మధ్య ఇప్పటికే నమో భారత్ రైలు సేవలు ప్రారంభించామని తెలిపారు. ఈ రెండు ప్రాంతాల మధ్య 359 కిలోమీటర్లు ఉండగా.. కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని తెలిపారు. భారత రైల్వేశాఖ అందిస్తున్న సౌకర్యాలపై ప్రయాణికులు సంతృప్తి చెందుతున్నట్లు భావిస్తున్నామని వివరించారు. Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే! ఇదిలాఉండగా.. దేశంలో త్వరలోనే హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. గంటకు ఏకంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించనున్నారు. బీఈఎంఎల్(BEML)తో కలిసి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లో ఈ రైళ్ల డిజైన్, తయారీ కొనసాగుతోందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవలే పార్లమెంట్‌లో తెలిపారు. బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో వందేభారత్ రైళ్లు సక్సెస్ అయిన నేపథ్యంలో మేకిన్ ఇండియా స్పూర్తితోనే ఈ హైస్పీడ్ రైళ్ల తయారీని చేపట్టినట్లు పేర్కొన్నారు. Also Read: మార్షల్ లా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఎత్తివేత.. కారణమేంటి? Also Read: రువాండాలో మరో ప్రాణాంతక వైరస్.. 15 మంది మృతి #railway-tickets #subsidy #discount #indian-railways #parliament #railways మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి