GOOD NEWS: చిటికెలో ట్రైన్ టికెట్ బుకింగ్.. కొత్త యాప్ అదుర్స్! భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించేలా అన్ని సేవలను ఒకే యాప్‌లో పొందేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఓ ‘సూపర్ యాప్’ను తీసుకొస్తుంది. డిసెంబర్ చివరి నాటికి ఈ యాప్ లాంచే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. By Seetha Ram 04 Nov 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలంటే విమానం లేదా ట్రైన్ జర్నీ చేయాలి. అయితే అధిక డబ్బులు పెట్టి విమానంలో వెల్లేవారు చాలా అంటే చాలా తక్కువ. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణికులు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే అందులో సామాన్య, మధ్యతరగతి ప్రజలే ఎక్కువ మంది. అందువల్ల ప్రతి రోజు దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణం చేస్తారు. Also Read: ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! ఇక ప్రయాణం చేసేముందు రిజర్వేషన్ టికెట్ల కోసం నానా ఇబ్బందులు పడతారు. అంతేకాకుండా ట్రైన్‌లో ఫుడ్ సహా మరిన్ని సేవలు పొందేందుకు, టికెట్ బుక్ చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ లేదా కన్ఫర్మ్ టికెట్ సహా మరిన్ని యాప్‌లు, వెబ్‌సైట్లు వాడుతుంటారు. ఎక్కువగా ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ వాడుతారు. అందరూ అదే యాప్ వాడటం వల్ల సర్వర్ బిజీ రావడం, తదితర సమస్యల కారణంగా టికెట్ అనేది కన్ఫర్మ్ కాదు. ఇదొక్కటే కాదు.. Also Read: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు! పలు సేవల కోసం రకరకాల యాప్స్ వీటితో పాటు అన్ రిజర్వడ్ టికెట్లకు యూటీఎస్, ఫుడ్ ఆర్డర్ కోసం ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్, ఇక కంప్లైంట్ చేసేందుకు మరొక యాప్, ఫీడ్ బ్యాక్ నమోదుకు రైల్ మదద్ వంటి అనేక యాప్‌లను వాడుతున్నారు. ఒక్కో సర్వీసుకు ఒక్కో యాప్ వాడుతుండటం వల్ల ప్రయాణికులు గజిబిజి అవుతున్నారు. ఏ యాప్ దేని కోసం వాడలో తెలియక సతమతమవుతన్నారు. ఇప్పుడు వారి సమస్యను దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. Also read: శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ అన్ని సర్వీసులకు ఒకటే యాప్ ఇకపై అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించేలా అన్ని సేవలను ఒకే యాప్‌లో పొందేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఓ ‘సూపర్ యాప్’ను తీసుకొస్తుంది. ఈ సూపర్ యాప్‌ను ‘CRIS’ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. Also Read: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం ఇప్పటికే ఈ సూపర్ యాప్ సిద్ధమైనట్లు తెలిపింది. డిసెంబర్ చివరి నాటికి ఈ యాప్ లాంచే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సూపర్ యాప్ గనుక అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ యాప్‌లోనే ట్రైన్ టికెట్ బుకింగ్, ప్లాట్ ఫామ్ టికెట్, అన్ రిజర్వ్డ్ టికెట్ల అన్నింటినీ బుక్ చేసుకోవచ్చు. #indian-railways #railway-app #irctc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి