/rtv/media/media_files/2024/10/22/nODhFRtNom5pZgLtgcxG.jpg)
ఈస్ట్ కోస్ట్ రైల్వే రీజియన్ లో దానా సైక్లోన్ కారణంగా భారీగా రైళ్లను రద్దు చేస్తున్నారు అధికారులు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే 37 రైళ్లను రద్ఉద చేసింది. ఈ రైళ్లలో సికింద్రాబాద్, హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, పాండిచ్చేరి, హౌరా, బెంగళూరు, యశ్వంతపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఉన్నాయి. పూర్తి వివరాలను ఈ కింది లీస్ట్ లో చూడొచ్చు.
ఇది కూడా చదవండి: Hydra మళ్ళీ పని మొదలు పెట్టిన హైడ్రా బుల్డోజర్లు.ఈ సారి ఎక్కడో తెలుసా?
"Cancellation of Trains due to Cyclone ‘DANA’ over East Coast Railway" @drmsecunderabad @RailMinIndia pic.twitter.com/ivmk2Lt4ny
— South Central Railway (@SCRailwayIndia) October 22, 2024
వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఏపీలో ఈ దానా తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అక్టోబర్ 23 నుంచి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 24 రాత్రి నుంచి అక్టోబర్ 25 ఉదయం వరకు 120 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరిస్తున్నారు. రేపు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇది చూడా చదవండి: వాహనదారులకు షాక్.. రోడ్లపై తిరగాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందే!
"Cancellation of Trains due to Cyclone ‘DANA’ over East Coast Railway" @drmsecunderabad pic.twitter.com/DBN4F5u7oA
— South Central Railway (@SCRailwayIndia) October 22, 2024
ఈ 3 రాష్ట్రాలపై ఎఫెక్ట్..
తుపాను విషయమై IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. తుఫాను తాకడానికి ఒక రోజు ముందు అక్టోబర్ 23న భారీ వర్షాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఒడిశా-బెంగాల్ తీర ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలలో అక్టోబర్ 24-25 తేదీల్లో 20 సెం.మీ వర్షపాతం నమోదు కావచ్చన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే?
ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హులను తేల్చనున్న యాప్