IND vs PAK : మెరిసిన ఇషాన్.. ముంచిన స్పిన్నర్లు: పాకిస్థాన్‌ టార్గెట్ 176

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా  ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

New Update
ind vs pak

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా  ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఒకానొక దశలో భారీ స్కోరు చేసేలా కనిపించినా, పాక్ స్పిన్నర్ల మాయాజాలంతో భారత్ మధ్యలో తడబడింది.

మ్యాచ్ ప్రారంభంలోనే భారత్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (0) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఇషాన్, మొత్తం 40 బంతుల్లో 77 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో తిలక్ వర్మ (25)తో కలిసి ఇషాన్ కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

అయూబ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు

భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్న తరుణంలో పాక్ పార్ట్-టైమ్ స్పిన్నర్ సైమ్ అయూబ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కీలక సమయంలో ఇషాన్ కిషన్‌ను అవుట్ చేయడమే కాకుండా, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలను వరుస బంతుల్లో పెవిలియన్ పంపి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. చివరలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో కొన్ని మెరుపులు మెరిపించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఏకంగా ఆరుగురు స్పిన్నర్లను ప్రయోగించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించగా, సైమ్ అయూబ్ 3 వికెట్లతో టాప్ బౌలర్‌గా నిలిచాడు.

Advertisment
తాజా కథనాలు