/rtv/media/media_files/2026/02/18/guinness-world-record-2026-02-18-21-35-55.jpg)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదైంది. కేవలం 24 గంటల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో AI రెస్పాన్సిబిలిటీ ప్రతిజ్ఞలు స్వీకరించిన దేశంగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఏమిటా రికార్డు?
కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి 16 ఉదయం నుండి 17 వరకు మొత్తం 2,50,946 మంది పౌరులు, విద్యార్థులు AIని నైతికంగా ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి ప్రవీణ్ పటేల్ ఈ ఘనతను అధికారికంగా ధృవీకరించారు. తొలుత కేవలం 5,000 ప్రతిజ్ఞలు మాత్రమే వస్తాయని అంచనా వేయగా, రికార్డు స్థాయిలో స్పందన రావడం విశేషం.
IndiaAI and Intel India earn GUINNESS WORLD RECORDS for most pledges received for an AI responsibility campaign in 24 hours. 🇮🇳 pic.twitter.com/kgyWhCt6eU
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 18, 2026
ప్రచార లక్ష్యం
ఇండియాAI మిషన్, ఇంటెల్ ఇండియా సంయుక్తంగా ఈ బాధ్యతాయుత ప్రచారాన్ని చేపట్టాయి.
లక్ష్యం: ఏఐ టెక్నాలజీని కేవలం వినూత్నంగానే కాకుండా.. డేటా ప్రైవసీ, జవాబుదారీతనం, పారదర్శకతతో వాడటం, తప్పుడు సమాచారాన్ని అరికట్టేలా పౌరులను ప్రేరేపించడం.
పాల్గొన్న విధానం: ప్రజలు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ప్రత్యేక పోర్టల్‌లో లాగిన్ అయి, ఏఐ నైతికతపై చిన్న క్విజ్ పూర్తి చేసి ఈ డిజిటల్ ప్రతిజ్ఞను తీసుకున్నారు. ప్రతిజ్ఞ పూర్తి చేసిన వారికి డిజిటల్ బ్యాడ్జ్‌లతో పాటు లెర్నింగ్ గైడ్స్‌ను కూడా ప్రభుత్వం అందించింది.
ప్రధాని మోదీ విజన్: అశ్విని వైష్ణవ్
కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈ చారిత్రాత్మక విజయాన్ని ప్రకటిస్తూ హర్షం వ్యక్తం చేశారు. "ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ యువతను అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానించాలని కోరుకుంటారు. ఆయన దార్శనికత వల్లే లక్షలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. AI అనేది సమాజానికి మేలు చేసే సాధనంగా ఉండాలి తప్ప, కీడు చేయకూడదు అనే సందేశాన్ని భారత్ ప్రపంచానికి చాటిచెప్పింది" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారం వంటి సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, భారత పౌరులు ఇంత పెద్ద సంఖ్యలో బాధ్యతాయుత వినియోగంపై ప్రతిజ్ఞ చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ రికార్డు ద్వారా గ్లోబల్ AI రంగంలో నైతిక ప్రమాణాల అమలులో భారత్ అగ్రగామిగా నిలిచింది.
Follow Us