India : ముంబై తీరంలో మూడు ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్!

ఇరాన్‌కు సంబంధించిన మూడు ఆయిల్ ట్యాంకర్లను ఇండియా ఇటీవల ముంబై తీరంలో స్వాధీనం చేసుకుంది. వీటిపై అమెరికా ఆంక్షలు ఉన్నాయి. అక్రమ వాణిజ్యాన్ని అరికట్టేందుకు భారత్ తన సముద్ర ప్రాంతంలో నిఘాను కట్టుదిట్టం చేసింది.  

New Update
india

ఇరాన్‌కు సంబంధించిన మూడు ఆయిల్ ట్యాంకర్లను ఇండియా ఇటీవల ముంబై తీరంలో స్వాధీనం చేసుకుంది. వీటిపై అమెరికా ఆంక్షలు ఉన్నాయి. అక్రమ వాణిజ్యాన్ని అరికట్టేందుకు భారత్ తన సముద్ర ప్రాంతంలో నిఘాను కట్టుదిట్టం చేసింది.  

Stellar Ruby, Asphalt Star , Al Jafzia అనే మూడు నౌకలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇవి పట్టుబడకుండా ఉండేందుకు తరచూ తమ గుర్తింపును మార్చుకుంటున్నాయని సమాచారం.ముంబైకి పశ్చిమాన సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో అనుమానాస్పద కార్యకలాపాలు సాగిస్తున్న ఈ నౌకలను అడ్డుకుని, తదుపరి విచారణ కోసం ముంబైకి తరలించారు. 

సుంకాలను 50% నుండి 18%కి

కాగా రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిన తర్వాత, అమెరికా భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాలను 50% నుండి 18%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఆయిల్ ట్యాంకర్ల సీజ్ ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఈ వార్తలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ వార్తలను ఖండించింది. ఆ మూడు ట్యాంకర్లకు నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదని, ఆ నౌకలు గానీ, వాటిలోని చమురు గానీ తమవి కావని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత కోస్ట్ గార్డ్ తన నిఘాను మరింత పెంచింది. సుమారు 55 నౌకలు, 10 నుండి 12 విమానాలు నిరంతరం సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నాయని సమాచారం.

 భారత అధికారులు పట్టుకున్న ఈ  నౌకలు అమెరికా గత ఏడాది ఆంక్షలు విధించిన నౌకల గుర్తింపు సంఖ్యలతో (IMO Numbers) సరిపోలుతున్నాయి. ఈ చర్యల వల్ల భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు