Pakistan Elections: ఎన్నికల ఫలితాలు విడుదల.. ఇమ్రాన్ అభ్యర్థులకే ఎక్కువ సీట్లు
పాకిస్థాన్‌లో ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇమ్రన్ పార్టీ 'పీటీఐ' బలపర్చిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలిచారు. నవాజ్ షరీఫ్‌కు చెందిన 'పీఎంఎల్-ఎన్' పార్టీ 75 స్థానాల్లో గెలిచింది. 'పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ' 54 సీట్లు రాగా.. మిగిలినవి ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.