పాకిస్థాన్‌లో ఉద్రిక్తత.. కనిపిస్తే కాల్చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు

పాకిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరసనాకారులపై కాల్పులు జరిపేందుకు పాక్ భద్రత బలగాలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

New Update
firee

పాకిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్’ (పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. దేశం నుంచి నలుమూలలకు చెందిన పీటీఐ కార్యకర్తలు ఆందోళనలు చేస్తూ రాజధాని ఇస్లామాబాద్‌కు వస్తున్నారు. దీంతో అనేకచోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇమ్రాన్‌ఖాన్ ఆదేశాలతో తన పార్టీ నేతలు, కార్యకర్తలు షాబజ్ షరీప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'డూ ఆర్ డై' నిరసనను చేసేందుకు రాజధానికి వెళ్తున్నారు.  

Also Read: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా ?

Islamabad

పలువురు పీటీఐ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే ఇస్లామాబాద్‌కు వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రస్తుతం ఇస్లామాబాద్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించింది. ఇక్కడ పాకిస్థాన్‌ సైన్యాన్ని కూడా భారీగా మోహరించింది. ఈ రెడ్‌జోన్ లోపల ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాని నివాసం, పార్లమెంటు, రాయబార కార్యాలయం కూడా ఉన్నాయి. అయతే నిరసనాకారులపై కాల్పులు జరిపేందుకు పాక్ భద్రత బలగాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. 

Also Read: ఏక్‌నాథ్ షిండే సంచలనం.. సీఎం పోస్ట్ నుంచి ఔట్!

ఇదిలాఉండగా.. ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు పెద్దఎత్తున ఇస్లామాబాద్‌లోకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్‌ నేతలు.. ప్రస్తుతం అడియాలో జైలులో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ను కలుసుకున్నారు. గత ఏడాది నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ రావల్పిండిలోని అడియాలోని జైలులోనే ఉంటున్నారు. అతనిపై దాదాపు 200లకు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్నింటిలో ఇమ్రాన్‌ఖాన్‌కు బెయిల్‌ రాగా.. మరికొన్నింటిలో ఆయన దోషిగా తేలాడు. మరికొన్ని కేసులపై ఇంకా విచారణ జరుగుతోంది.   

Also Read: విమానం ల్యాండ్‌ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు.. చివరికీ

Also Read: అదానీకి మరో షాక్..పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించిన టోటల్ ఎనర్జీస్

Advertisment
Advertisment
తాజా కథనాలు