ఇమ్రాన్ ఖాన్ కు మరోసారి షాక్.... మాజీ ప్రధాని కస్టడీని పొడిగించిన కోర్టు....!
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ తగిలింది. తోఫ్ ఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు తీర్పును హైకోర్టు రద్దు చేసిన సంతోషం ఎంతో సేపు నిలవలేదు. తీర్పు వెలుపడిన కొన్ని గంటల్లోనే సైపర్ కేసులో విచారణ కోసం ఇమ్రాన్ ఖాన్ జైలు కస్టడీని పాకిస్తాన్ కోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించింది. అటాక్ జైలులో ఈ రోజు విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు ఈ మేరకు కస్టడీని పొడిగించింది.