PCB: పాక్ క్రికెట్‌ను అతనే నాశనం చేశాడు.. పీసీబీ బోర్డ్ ఛైర్మన్ సంచలనం!

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఘోర పరాజయంపై ఆ దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. ఇమ్రాన్ ఖాన్‌ వల్లే తమ దేశ క్రికెట్ ఇలా తయారైందంటూ పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్‌ సేథి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో ఇమ్రాన్‌ఖాన్‌ తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ కుండబద్దలు కొట్టారు. 

New Update
pak pcb

Najam Sethi shocking cmments on Imran Khan

PCB: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పాకిస్థాన్ ఘోర పరాజయంపై ఆ దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సెమీస్‌కు దూరం కావడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పాక్ క్రికెటర్ల దిష్టిబొమ్మలు తగలబెట్టి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ నజామ్‌ సేథి తనదైన స్టైల్‌లో విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని, పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌ వల్లే తమ దేశ క్రికెట్ ఇలా తయారైందంటూ ఫైర్ అయ్యారు. 

క్రీడా వర్గాలు చెబుతుంది నిజమే..

ఈ మేరకు నజామ్‌ సేథి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు ప్రపంచంలోనే పాకిస్థాన్ నంబర్‌ 1 టీమ్. 1992 వరల్డ్‌ కప్‌, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత. 1990, 1996లో వన్డేల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2016లో టెస్టుల్లో టాప్‌లో ఉంది. 2018లో టీ20ల్లో అగ్రస్థానం. అలాంటి జట్టు ఇప్పుడు జింబాబ్వేతో సమానం ఎలా అయింది. పాక్‌ క్రికెట్ పతనమైందని క్రీడా వర్గాలు చెబుతుంది నిజమే. అయితే ఈ పతనం 2019లోనే మొదలైంది. 

అదే అతిపెద్ద తప్పు..

ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కొత్త మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. దేశవాళీ క్రికెట్‌ను మార్చేసి, డొమిస్టిక్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆసీస్‌ హైబ్రిడ్‌ మోడల్‌ను ఇక్కడ ప్రవేశపెట్టడం అతిపెద్ద తప్పు. రాజకీయాలు పెరిగిపోవడంతో పీసీబీ విధానాలు దారితప్పి క్రికెట్ పతనానికి కారణమవుతున్నాయి. జట్టులో సహచరులతో కెప్టెన్‌కు పడదు. గ్రూపులు మొదలయ్యాయి. విదేశీ కోచ్‌లను ఎంపికలో గందరగోళం మేనేజ్‌మెంట్‌లోపాలు పాక్ క్రికెట్ ను దెబ్బతీశాయి' అంటూ కుండబద్దలు కొట్టాడు. 

Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

పాక్ పై విజయంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ చేరింది. 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.  అయితే ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ టోర్నీ నుంచి దాదాపుగా వైదొలిగినట్ల్లే. మిగిలిన ఒక్క మ్యాచ్‌లో గెలిచినా పాకిస్థాన్ సెమీస్ చేరడం అసాధ్యం. 

Also Read: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు